ప్యూన్‌ ఉద్యోగానికి.. 3700 పీహెచ్‌డీ అభ్యర్థుల పోటీ

93000 Applications For 62 Peon Posts In UP - Sakshi

లక్నో : ఖాళీగా ఉన్న ఉద్యోగాల సంఖ్య కేవలం 62 కానీ.. వాటికి వచ్చిన అప్లికేషన్లు ఏకంగా 93,500. దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో తాండవిస్తోందో ఈ ఘటన చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. టెలికాం డిపార్ట్‌మెంట్‌లో ఖాళీ అయిన 62 ప్యూన్‌ పోస్టులకు అధికారులు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రంగా ఉండడంతో ఏకంగా పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ప్యూన్‌ పోస్టుల కోసం అప్లికేషన్‌ పెట్టుకున్నారు.

93,500 అప్లికేషన్లు రాగా వాటిలో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారు 3,700, పీజీ పూర్తి చేసిన వారు 50,000, డిగ్రీ ఇతర కోర్సులు పూర్తి చేసిన వారు 28,000 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు టెలికాం డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రమోద్‌ కుమార్‌ తివారి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగంపై ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని, నిరుద్యోగులపై సీఎం యోగి ఆదిత్యానాథ్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటని ఎస్పీ నేత అబ్దుల్‌ హాఫీజ్‌ గాంధీ విమర్శించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top