43 ఏళ్ల తర్వాత కుటుంబాన్ని చేరిన వృద్ధురాలు

90 Years Old Woman Reunited With Her Family After 43 Years - Sakshi

ముంబ : అనుకోని సంఘటనలతో  ఏళ్ల పాటు కుటుంబ సభ్యులకు దూరంగా వెళ్లిపోయిన వారు తిరిగి సోషల్‌ మీడియా ద్వారా మళ్లీ ఒకటవుతున్నారు. సోషల్‌ మీడియాతో అనార్థాలే కాదు.. మంచి సంఘటనలు సైతం జరుగుతాయని మరోసారి రుజువైంది. తాజాగా దాదాపు 43 ఏళ్ల తర్వాత పంచుబాయ్‌(90) అనే వృద్ధురాలు గూగుల్‌, వాట్సప్‌ సహయంతో తన కుటుంబాన్ని చేరుకుంది. మహారాష్ట్రలోని తాల గ్రామంలో నివసిస్తున్న నూర్‌ ఖాన్‌‌ కుటుంబానికి చెందిన పంచబాయ్‌ (అచ్చన్‌) గుగూల్‌, వాట్సప్‌ ద్వారా కనుగొన్నామని నూర్‌ ఖాన్‌ కుమారుడు ఇశ్రార్‌ ఖాన్‌ తెలిపాడు. గత నెలలో పంచబాయ్‌ మహారాష్ట్రకు చెందిన వారని తెలిసిందని చెప్పాడు. దీంతో వివరాలు కనుక్కొని అచ్చన్‌ మనవడు పృథ్వీ కుమార్‌ షిండేకు శనివారం అప్పజెప్పిన్నట్లు ఖాన్‌ చెప్పాడు. (డేంజర్‌ బెల్స్‌: ఒక్క రోజులో దాదాపు 55వేల కేసులు)

‘అచ్చన్(పంచుబాయ్‌)‌ ఇలా మా ఇంటికి వచ్చింది’
అమరావతి జిల్లా బుందేల్‌ఖండ్‌  వద్ద మా తండ్రి నూర్‌ ఖాన్ 43 సంవత్సరాల క్రితం‌ చుశాడని ఇశ్రాన్‌ ఖాన్‌ చెప్పాడు. అప్పుడు తను తేనెటీగల దాడిలో గాయపడి కనిపించింది. దీంతో అచ్చన్‌కు‌ మా తండ్రి నాటు వైద్యం చేయించి తన గాయాలను తగ్గించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అటువైపు వెళ్తున్న మా తం‍డ్రికి అచ్చన్‌ మళ్లీ అక్కడే కనిపించింది. తన దగ్గరికి వెళ్లి మీరు ఎవరూ, ఎక్కడికి వెళ్లాలని అని అడగ్గా తను ఏం చెప్పలేని పరిస్థితిలో ఉండటంతో ఆయన తనని ఇంటికి తీసుకువచ్చారని చెప్పాడు. ఇక అప్పటి నుంచి ఆమె అచ్చన్‌గా మాతో పాటే మా కుటుంబంలో వ్యక్తిగా ఉంటున్నారన్నాడు. పంచుబాయ్‌కి అచ్చన్‌ అనే పేరును ఆయనే పెట్టారని కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు ఆయన లేరని కొన్నేళ్ల క్రితం మరణించారన్నాడు. అయితే అచ్చన్‌ ఎక్కువగా ఉత్తర మరాఠీ పదాలను వాడేవాదని. అయితే మేము అచ్చన్‌ ఎవరో, ఎక్కడి నంచి వచ్చారో తెలుసుకునేందుకు చాలాసార్లు ప్రయత్నించాము కానీ తను చెప్పేది మాకు అర్థమయ్యేది కాదన్నాడు. 

ఈ క్రమంలో మే 4న మా కుటుంబమంతా కుర్చోని మాట్లాడుకుంటుండగా అచ్చన్‌ ఏదో చెప్పాడానికి ప్రయత్నించింది. తన మాటలను నేను గూగుల్‌లో రికార్డు చేశాను. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా అచ్చన్‌ చెప్పిన మాటలను చూస్తే కంజమ్‌ నగర్‌ను చూపించింది. ఇక వెంటనే నేను కంజమ్‌ నగర్‌ మ్యాప్‌లో వెతకగా  ఇది  అమరావతి జిల్లాలోని పంచాయతి నగరంగా చూపించింది. ఇక వెంటనే గూగుల్‌ సహాయంతో కంజమ్‌ నగర్‌ పంచాయతీ అధికారి అభిషేక్‌ నెంబర్‌ కనుగొన్నాను. ఆయనతో మాట్లాడి వాట్సప్‌ ద్వారా అచ్చన్‌ ఫొటో పంపించాను. ఆయన అచ్చన్‌ కుటుంబం ఆ గ్రామంలోనే ఉందని,  పేరు పంచుబాయ్‌ అని చెప్పడంతో మేమంతా ఎగిరి గంత్తేశామని ఇశ్రార్‌ ఖాన్‌ తెలిపాడు. ('చైనా దురాక్రమణకు మోదీ లొంగిపోయారు')

ఖాన్‌ కుటుంబానికి ధన్యవాదాలు: పంచుబాయ్‌ మనవడు
పంచాయతీ అధికారి అభిషేక్‌ మా నానమ్మ గురించి నాకు చెప్పడంతో‌ ఖాన్‌ సపంద్రించానని పంచుబాయ్‌ మనవడు పృథ్వీ రాజ్‌ షిండే చెప్పాడు. వెంటనే తను ఖాన్‌ ఫొన్‌ చేసి ‘తను మా నానమ్మ పంచుబాయ్‌ అని, మా తాత తేజ్‌పాల్‌(పంచుబాయి భర్త) తండ్రి భైలాల్‌(పంచుబాయ్‌ కుమారుడు) తన కోసం చాలా వెతికారు.. తను కనిపించడం లేదని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. తన కోసం వెతికి వెతికి చివరికి వారు ఆశలు వదులుకున్నారు. మా తాత తేజ్‌పాల్‌ 2005లో మరణించగా మా తండ్రి భైలాల్‌ 3 సంవత్సరాల క్రితం చనిపోయారు’ అని కూడా చెప్పాడు.  43 ఏళ్లకు తన నానమ్మను  ఇంటికి తీసుకువెళ్తున్నందకు చాలా సంతోషంగా ఉందని షిండే ఆనందం వ్యక్తం చేశాడు. అయితే బాధించే విషయం ఏంటంటే మా తాతయ్య, తండ్రి  నానమ్మను చూడకుండానే కన్నుమూశారని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక మా నానమ్మ మమ్మల్ని.. మేము తనని చూడకుండా 40 ఏళ్లు గడిపామంటూ.. ఇనేళ్లు తన నానమ్మను జాగ్రత్తగా చూసుకున్న ఖాన్‌ కుటుంబానికి షిండే ధన్యవాదాల తెలిపాడు. (‘గూగుల్‌లోకి 6 కోట్ల షేర్‌చాట్‌ యూజర్స్‌’)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top