‘గూగుల్‌లోకి 6 కోట్ల షేర్‌చాట్‌ వినియోగదారులు’

ShareChat Migrates Users To Google Cloud - Sakshi

ముంబై: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వాడే యువతకు పరిచయం అక్కర్లేని యాప్‌ షేర్‌ చాట్‌.  ప్రస్తుతం షేర్‌చాట్‌ సంస్థ ఖర్చులను తగ్గించి విస్తృత సేవలను అందించాలని భావిస్తోంది. అందులో భాగంగా సోషల్‌ మీడియా దిగ్గజం గూగుల్‌ క్లౌడ్‌లోకి తమ యాప్‌కు చెందిన 6 కోట్ల మంది వినియోగాదారులను బదిలీ చేశామని సోమవారం షేర్‌చాట్‌ ప్రకటించింది. ప్రస్తుతం షేర్‌చాట్‌ అన్ని రంగాల వారికి ఉపయోగపడుతుంది. కాగా విద్య, వ్యాపారం, ఉద్యోగం ఇలా ఏ రంగాల వారైనా సరే వారి మనోభావాలు, కళాత్మక నైపుణ్యం, మాటలు, వీడియోలు, సరదా సన్నివేశాలు ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు షేర్‌చాట్‌ కీలక పాత్ర పోషిస్తుంది. కాగా వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు 6 కోట్ల మందికి ఉపయోగపడే మౌలిక సదుపాయాలను బదిలీ చేశామని తెలిపింది.

షేర్‌చాట్‌ తన వ్యాపార వృద్ధిని మరింత విస్తరించడానికి, ఖర్చులను తగ్గించడానికి, వినియోగదారులకు అత్యుత్తమ సేవలందించేందుకు ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది.  ఇటీవల షేర్‌చాట్‌ మెరుగైన సేవల కోసం అత్యాధునిక  ఐటి మౌలిక సదుపాయాలపై ఆధారపడుతుంది. దీని వల్ల అధిక డేటా, కంటెంట్‌, ఎక్కువ వినియోగదారులు ఉపయోగించడం(ట్రాఫిక్‌ కారణంగా) ఇటీవల కాలంలో షేర్‌చాట్‌కు సమస్యగా మారింది. షేర్‌చాట్‌ వినియోగదారులలో అధిక శాతం టైర్ 2, టైర్ -3 నగరాలకు చెందినవారు కావడంతో వారు ఇప్పటికీ 2జీ నెట్‌వర్క్‌పైనే ఆధారపడుతున్నారు.

ఈ క్రమంలో మొబైల్‌లో తమ సేవలను వినియోగించే వారికి అత్యుత్తమ సేవలందించేందుకు గూగుల్‌ క్లౌడ్‌లో ఒప్పందం కుదుర్చుకున్నట్లు షేర్‌చాట్‌ పేర్కొంది. ప్రస్తుతం సంస్థ వృద్ధి బాటలో కొనసాగుతోందని, కానీ ఖర్చులను తగ్గించి మెరుగైన సేవలందించేందుకు గూగుల​తో ఒప్పందం కుదుర్చోవడం ఎంతో కీలకమని షేర్‌ చాట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వెంకటేష్‌ రామస్వామి పేర్కొన్నారు. మరోవైపు మెరుగైన సేవల కోసం 6 కోట్ల మంది వినియోగదారులను తమకు బదిలీ చేయడం సంతోషకరమని గూగుల్‌ క్లౌడ్‌ ఎండీ కరణ్‌ బాజ్వా తెలిపారు.  (చదవండి: చాటింగ్‌ తెచ్చిన చేటు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top