డెంగ్యూనా? 650 ఎంజీ పారాసిటమాల్‌ వేసుకోండి!

650 mg paracetamol instead of usual 500 needed to cure dengue, Says CM Rawat advises patients - Sakshi

డెహ్రాడూన్‌: ఎక్కడ చూసినా డెంగ్యూ ఫీవర్‌ హడలెత్తిస్తోంది. ఉత్తరాఖండ్‌ను డెంగ్యూ వణికిస్తోంది. వందలసంఖ్యలో రోగులు డెంగ్యూ ఫీవర్‌తో బాధపడుతూ.. ఆస్పత్రులకు పోటెత్తుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 4,800 మందికి డెంగ్యూ ఫీవర్‌ సోకినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా డెహ్రాడూన్‌ ప్రాంతంలో డెంగ్యూ తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ మూడువేల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక తర్వాతి స్థానంలో హల్ద్‌వానీ ప్రాంతం ఉంది. ఇక్కడ 1100 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. 

డెంగ్యూ తగ్గడం లేదా.. ఐతే..
ఉత్తరాఖండ్‌ను డెంగ్యూ వణికిస్తున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. డెంగ్యూ ఫీవర్‌ తగ్గకపోతే.. 500 ఎంజీకి బదులు, 650 ఎంజీ పారసిటమాల్‌ ట్యాబెట్లు వేసుకోవాలని, డెంగ్యూ తగ్గిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. డెంగ్యూ రాష్ట్రంలో తీవ్రస్థాయిలో పెచ్చరిల్లిందని, ఈ నేపథ్యంలో 650 ఎంజీ పారాసిటమాల్‌ వేసుకొని.. విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతుందని రావత్‌ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో డెంగ్యూ కారణంగా ఎనిమిది మంది చనిపోయినట్టు గతవారం ఆరోగ్యశాఖ అధికారికంగా వెల్లడించగా.. సీఎం రావత్‌ మాత్రం కేవలం నలుగురే చనిపోయారని చెప్పుకొచ్చారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top