ప్రియురాలి కోసం బిత్తిరి చర్య.. చిక్కుల్లో ప్రియుడు

300 Banners Set Up By Boyfriend In Pimpri Chinchwad - Sakshi

సాక్షి, పుణె: ప్రేయసిని ప్రసన్నం చేసుకోవడానికి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ప్రేమించిన అమ్మాయితో గొడవ పడటంతో తను మాట్లాడటం లేదని బిత్తిరి చర్యకు పాల్పడిన ప్రియుడు చిక్కుల్లో పడ్డాడు. వివరాలు..  పుణెకు దగ్గర్లోని పింప్రి చించ్వాడ్‌కు చెందిన నీలేశ్‌ ఖేడెకర్‌ తన ప్రేయసితో గొడపెట్టుకున్నాడు. తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పాలని అనుకున్నాడు. కానీ ఆమె అవకాశం ఇవ్వలేదు. ముంబై నుంచి చించ్వాడ్‌ మీదుగా పుణెకు వెళ్తుందని సమాచారం తెలుసుకున్నాడు. రాత్రికిరాత్రే తన స్నేహితుడి సహాయంతో ‘ఐయామ్‌ సారీ’  అంటూ ఆమె పేరు రాసిన సుమారు 300 బ్యానర్లు నగరమంతా కట్టాడు.

ప్రియుడు చేసిన ప్రయత్నం ప్రేయసికి నచ్చిందో లేదో కాని మున్సిపల్‌, పోలీస్‌ శాఖలకు మాత్రం నచ్చలేదు. బహిరంగ ప్రదేశాల్లో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు అనుమతి లేకుండా పెట్టడం నిషేదం. దీంతో నీలేశ్‌పై చర్యలు తప్పవని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబదించిన వార్త సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయంపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ప్రియురాలి కోసం చేసిన పని కాబట్టి క్షమించి వదిలేయాలని కొందరు కోరుతుండగా.. భవిష్యత్‌లో ఇలాంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా ఉండాలంటే చర్యలు తీసుకోవాల్సిందిగా మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.    

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top