విగతజీవిగా మారిన ఐఐటీ విద్యార్థి | 18-year-old IIT aspirant was found dead | Sakshi
Sakshi News home page

విగతజీవిగా మారిన ఐఐటీ విద్యార్థి

Dec 15 2014 11:05 PM | Updated on Nov 9 2018 4:36 PM

ఐఐటీ చదువుతున్న18ఏళ్ల విద్యార్థి విగతజీవిగా మారిన ఘటన మధ్యప్రదేశ్లోని మహావీరనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది.

మధ్యప్రదేశ్: ఐఐటీ చదువుతున్న18ఏళ్ల విద్యార్థి అనుమానస్పద స్థితిలో విగతజీవిగా మారిన ఘటన మధ్యప్రదేశ్లోని మహావీరనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. మృతుడు శివపూరి ప్రాంతానికి చెందిన సుభాన్షు ఖారే అనే ఐఐటీ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. స్నేహితుడి రూంలో రాత్రి నిద్రపోయిన అతడు ఉదయాన్నే అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు.  అతని మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పోస్టుమార్టం నిర్వహించిన తరువాతే ఏ విషయమైనది కనిపెడతామని పోలీసులు చెప్పారు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు నివ్వేరపోయారు. విగతజీవిగా పడివున్న తమ కుమారుడిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ వంటి ఏ ఆధారాలు దొరకలేదని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement