ఐష్‌ను మిస్సయ్యా

Will Smith wants to do a film with Aishwarya Rai Bachchan - Sakshi

హాలీవుడ్‌ యాక్టర్స్‌తో వెండితెర పంచుకోవాలని చాలా మంది నటీనటులు కలలు కంటుంటారు. కానీ, ప్రముఖ హాలీవుడ్‌ నటుడు విల్‌ స్మిత్‌ మాత్రం అందాలతార ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించాలని కోరుకుంటున్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో బాలీవుడ్‌ నటుడు ఫర్హాన్‌ అక్తర్‌తో జరిగిన ఓ సంభాషణలో భాగంగా విల్‌ స్మిత్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఐశ్వర్యారాయ్‌ని కలిసి, ఓ సినిమా గురించి మాట్లాడాను. కానీ, కుదర్లేదు. డ్యాన్స్‌ సీక్వెన్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమాలో ఐశ్వర్యారాయ్‌తో కలిసి నటించాలని ఉంది’’ అని మనసులోని మాటను బయటపెట్టారు విల్‌ స్మిత్‌.

దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. ప్రపంచ వ్యాప్తంగా ఐశ్వర్యారాయ్‌కి ఎంత క్రేజ్‌ ఉందో. ఖతర్‌ దేశంలో జరిగిన ఓ ఫ్యాషన్‌ ర్యాంపులో పాల్గొన్న ఐశ్వర్యను చూస్తే ఆమె అందం ఏ మాత్రం తగ్గలేదనే విషయం తెలుస్తోంది. ఇంకా వ్యక్తిగత విషయాల గురించి విల్‌స్మిత్‌ మాట్లాడుతూ –‘‘ చిన్నప్పుడు నేను హింసాత్మక వాతావరణంలో పెరిగాను. అందుకే నా పిల్లలకు మెరుగైన జీవితాన్ని అందించాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నా’’ అన్నారు. ఇటీవల విల్‌స్మిత్‌ 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌సింగ్, నిర్మాత కరణ్‌ జోహార్‌లతో కలిసి సందడి చేసి, ఓ సెల్ఫీ దిగారు విల్‌స్మిత్‌. ఈ ఫొటోలను రణ్‌వీర్‌ షేర్‌ చేశారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top