వారెవ్వా చికెన్‌ టిక్కా మసాలా

Will Smith Likes Akshay Kumar's Chicken Tikka Masala  - Sakshi

విల్‌స్మిత్‌ కొత్త సినిమా ‘బ్రైట్‌’ నెట్‌ఫ్లిక్స్‌లో గత వారమే విడుదలైంది. ఇప్పుడు సినీ అభిమానికి ఒక స్టాప్‌ పాయింట్‌లా మారిపోయిన నెట్‌ఫ్లిక్స్‌లో ఇంత పెద్ద సినిమా నేరుగా విడుదలవ్వడం అన్నది ఫిల్మ్‌ బిజినెస్‌ పరంగా చూస్తే అతిపెద్ద మార్పుగానే చెప్పుకోవచ్చు. భవిష్యత్‌లో సినిమాలు థియేటర్లలో కాకుండా ఇలా నేరుగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లపై వస్తాయనడానికి ఇదొక ముందస్తు సూచన. ఇండియాలోనూ నెట్‌ఫ్లిక్స్‌ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూ ఉండడంతో ఇండియా మార్కెట్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది ‘బ్రైట్‌’ టీమ్‌.

ఈ నేపథ్యంలోనే గతవారం విల్‌స్మిత్‌ స్వయంగా సినిమాను ప్రమోట్‌ చేసేందుకు ఇండియా వచ్చాడు. నేషనల్‌ మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడిపిన ఆయన ఇండియాతో తన గతానుభవాలు పంచుకున్నాడు. గతంలో తాను బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఇచ్చిన పార్టీకి వచ్చానని, ఆ పార్టీలో తిన్న చికెన్‌ టిక్కా మసాలా వారెవ్వా అని, తనకు ఫేవరెట్‌ ఫుడ్‌ అని చెప్పుకొచ్చాడు. ఇక ‘బ్రైట్‌’ విషయానికి వస్తే ఫ్యాంటసీ యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్లో ఈ సినిమా తెరకెక్కింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top