కత్రినా, రణబీర్ మళ్లీ కలుస్తారా? | Who is trying to be a peacemaker between Ranbir Kapoor, Katrina Kaif? | Sakshi
Sakshi News home page

కత్రినా, రణబీర్ మళ్లీ కలుస్తారా?

Jan 21 2016 3:59 PM | Updated on Sep 3 2017 4:03 PM

కత్రినా, రణబీర్ మళ్లీ కలుస్తారా?

కత్రినా, రణబీర్ మళ్లీ కలుస్తారా?

బాలీవుడ్ ప్రేమజంట కత్రినా కైఫ్- రణబీర్ కపూర్‌ ప్రేమకథ కంచికి పోకుండా చూసేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయట.

ముంబై:  బాలీవుడ్ ప్రేమజంట కత్రినా కైఫ్- రణబీర్ కపూర్‌  ప్రేమకథ గత కొంతకాలంగా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో  నిత్యం  వార్తల్లో నిలుస్తోంది. తాజాగా కత్రినా కైఫ్-రణబీర్ కపూర్‌ ప్రేమకథ కంచికి పోకుండా చూసేందుకు ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయట.  వీరిద్దరూ విడిపోకుండా ఉండేందుకు  బి టౌన్ లోని  వీరిద్దరి కామన్ ఫ్రెండ్స్  కొంతమంది  తమ ప్రయత్నం తాము చేస్తున్నారని సమాచారం. ఎలాగైనా  కత్రినా, కేఫ్ ప్రేమకథకు ఫుల్స్టాప్ పడకుండా ఉండాలని శాయశక్తులా ప్రయత్నిస్టున్నట్టు తెలుస్తోంది.  

ముఖ్యంగా  రణబీర్ సన్నిహితుడు,  ఫితూర్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ ఈ ప్యాచ్ అప్  ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నాడట.  ప్రేమికుల మధ్య నెలకొన్న విబేధాలను పరష్కరించే  బాధ్యతను ఆదిత్య తీసుకున్నాడని బాలీవుడ్లో వార్తలు గుప్పుమన్నాయి. బర్ఫీ బాబుకి, షీలాకీ జవానీ బేబీకి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆదిత్య అయితేనే కరెక్టే అని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుతున్నారు.  మరి ఆదిత్య రాయబారం ఫలిస్తుందా? కత్రినా-రణబీర్ కలుస్తారా అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement