స్టార్‌ హీరో మూవీ.. నన్ను తీసేశారు: ప్రముఖ హీరోయిన్‌ | Katrina Kaif: My Role in Bachna Ae Haseeno Was Cut | Sakshi
Sakshi News home page

Katrina Kaif: ఆ సినిమాలో నేనూ హీరోయిన్‌నే.. కానీ నన్ను తీసేశారు!

Published Fri, Mar 1 2024 3:32 PM | Last Updated on Fri, Mar 1 2024 3:53 PM

Katrina Kaif: My Role in Bachna Ae Haseeno Was Cut - Sakshi

ఈ సినిమా చిత్రీకరణ సమయంలో రణ్‌బీర్‌-దీపికాలు లవ్‌లో పడ్డారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కత్రినాతోనూ డేటింగ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. చివరకు ఆలియా భట్‌ను

'బచ్నా యే హసీనో'.. 2008లో రిలీజైన బాలీవుడ్‌లో మూవీ.. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించాడు. కథలో భాగంగా అతడు ముగ్గురు హీరోయిన్లతో ప్రేమలో పడతాడు. అయితే అతడు నాలుగో హీరోయిన్‌తో కూడా ‍ప్రేమపాఠాలు నడుపుతాడని కథలో రాసుకున్నారట! కానీ ఫైనల్‌ స్క్రిప్ట్‌లో మాత్రం ఆ పాత్రనే లేపేశారంటోంది స్టార్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌. ఆ నాలుగో హీరోయిన్‌ కోసం తనను సంప్రదించారని చెప్తోంది.

నా రోల్‌ తీసేశారు
తాజాగా కత్రినా కైఫ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'బచ్నా యే హసీనో సినిమాలో నన్ను నాలుగో అమ్మాయిగా అనుకున్నారు. కానీ చివరకు ఆ పాత్రను తీసేశారు. ఇకపోతే జీరో మూవీలో అనుష్క పాత్రను చేయాలనుకున్నాను. అదే సమయంలో బబిత ఆఫర్‌ రావడంతో దాన్ని చేశాను' అని చెప్పుకొచ్చింది. జీరో బాక్సాఫీస్‌ దగ్గర చతికిలపడగా బబిత హిట్‌ మూవీగా నిలిచింది.

ఈ సినిమా టైంలోనే డేటింగ్‌
కాగా బచ్నా యే హసీనో మూవీకి సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించగా సిద్దార్థ్‌ ఆనంద్‌ నిర్మించారు. ఇందులో మనీషా లంబ, బిపాషా బసు, దీపిక పదుకోణ్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో రణ్‌బీర్‌-దీపికాలు లవ్‌లో పడ్డారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత కత్రినాతోనూ డేటింగ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. చివరకు ఆలియా భట్‌ను పెళ్లాడాడు. కత్రినా సినిమాల విషయానికి వస్తే ఆమె చివరగా మేరీ క్రిస్‌మస్‌ సినిమాలో నటించింది. ఈ మూవీ జనవరి 12న రిలీజైంది.

చదవండి: హైదరాబాద్‌ టు ముంబై... బాలీవుడ్‌లో ఫేమస్‌ విలన్‌.. హీరోల వల్ల కెరీర్‌ నాశనం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement