కరీనా అంటే కస్సుమనే ప్రియాంక.. బిపాసా | What fire Bipasha Kareena and Priyanka | Sakshi
Sakshi News home page

కరీనా అంటే కస్సుమనే ప్రియాంక.. బిపాసా

Jul 23 2015 11:13 PM | Updated on Sep 3 2017 6:02 AM

కరీనా అంటే కస్సుమనే ప్రియాంక.. బిపాసా

కరీనా అంటే కస్సుమనే ప్రియాంక.. బిపాసా

ప్రియాంకా చోప్రా, బిపాసా బసుల పేరు ఎత్తితే కరీనాకి పట్టరానంత కోపం వచ్చేస్తుంది. బిపాసాతో కరీనా వైరం ముందు వృత్తిపరమైనది.. తర్వాత వ్యక్తిగతంగా కూడా మొదలైంది.

ప్రియాంకా చోప్రా, బిపాసా బసుల పేరు ఎత్తితే కరీనాకి పట్టరానంత కోపం వచ్చేస్తుంది.  బిపాసాతో కరీనా వైరం ముందు వృత్తిపరమైనది.. తర్వాత వ్యక్తిగతంగా కూడా మొదలైంది. బిపాసా, కరీనా పోటీ పడి సినిమాలు చేసేవాళ్లు. అసూయతో ఓ సందర్భంలో ‘ఆ నల్ల పిల్లి’ అంటూ బిపాసాను ఉద్దేశించి బహిరంగంగా ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అది మాత్రమేకాదు బిపాసా బోయ్‌ఫ్రెండ్ (ఇప్పుడు మాజీ) జాన్ అబ్రహాం అసలు నటుడే కాదని కూడా విమర్శించారు. ఇన్ని మాటలన్న తర్వాత బిపాసా ఊరుకుంటారా? ‘ఆ తెల్ల మొహంలో హావభావాలు పలకవు..’ అని కరీనాను ఉద్దేశించి కామెంట్ చేశారు. ఇప్పటికీ ఈ ఇద్దరికీ మధ్య స్నేహం లేదు.
 
 ఇక, ప్రియాంకా చోప్రా, కరీనా గురించి చెప్పాలంటే.. హిందీ రంగంలో పెద్ద కుటుంబానికి చెందిన కరీనాను మహారాణీలా చూస్తారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చిన ప్రియాంకా చోప్రాకి అంత రాయల్ ట్రీట్‌మెంట్ దొరికే అవకాశం లేదు. ఆ విషయంలో కరీనా అంటే ప్రియాంకాకు కొంత అసూయ ఉండేదని పరిశీలకులు అంటుంటారు. అలాగే, సినిమా అవకాశాలు దక్కించుకునే విషయంలో కూడా ఇద్దరూ పోటీపడేవారట. చివరికి షాహిద్ కపూర్ కారణంగా ఈ ఇద్దరూ వ్యక్తిగతంగా కూడా శత్రువులయ్యారు. షాహిద్, కరీనా ప్రేమించుకున్న విషయం ప్రపంచానికి తెలుసు. ఈ ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలు మొదలైనప్పుడు షాహిద్‌కు ప్రియాంక దగ్గరయ్యారట. దాంతో కరీనా, ప్రియాంక మధ్య బద్ధ శత్రుత్వం మొదలైంది.
 
 ఈ ప్రపంచంలో ఎవరూ నిత్య మిత్రులుగా ఉండరు.. అలాగని శత్రవులుగానూ ఉండిపోరు. ఇవాళ ఉన్న కోపం రేపు ఉండకపోవచ్చు. కానీ, ఈ ముద్దుగుమ్మలు మాత్రం ఎప్పటికీ శత్రువులుగానే మిగిలిపోతారన్నది బాలీవుడ్‌వారి అభిప్రాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement