ఫ్యాన్స్కు బిగ్ బీ వార్నింగ్ | warns fans against his fake Twitter account | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్కు బిగ్ బీ వార్నింగ్

May 24 2015 3:04 PM | Updated on Sep 3 2017 2:37 AM

ఫ్యాన్స్కు బిగ్ బీ వార్నింగ్

ఫ్యాన్స్కు బిగ్ బీ వార్నింగ్

తన అభిమానులకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హెచ్చరికలు జారీ చేశారు. తన పేరిట ఎవరో ఫేక్ ట్విట్టర్ ఖాతాను తెరిచారని, దానిపై తాను టిక్ చేసిన గుర్తులేదని, ఆవిషయాన్ని ఫ్యాన్స్ గుర్తించాలని చెప్పారు.

ముంబయి: తన అభిమానులకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హెచ్చరికలు జారీ చేశారు. తన పేరిట ఎవరో ఫేక్ ట్విట్టర్ ఖాతాను తెరిచారని, దానిపై తాను టిక్ చేసిన గుర్తులేదని, ఆవిషయాన్ని ఫ్యాన్స్ గుర్తించాలని చెప్పారు. తన పేరిట వచ్చే ఫేక్ ఖాతా ద్వారా పోస్టింగ్లు నమ్మవద్దని, దానికి తాను బాధ్యుడిని కాదని చెప్పారు. హెచ్చరిక: @srbachannc.. ఇక్కడ నాపేరు చివర 'సీ' అనే అక్షరం అదనంగా యాడ్ చేసి ఉంది. ఇది ఫేక్ ఖాతా. అది నేను సృష్టించినది కాదు.

ఈ విషయాన్ని అందరు గుర్తించి దానిని పట్టించుకోకుండా ఉంటే మంచిది' అని అమితాబ్ చెప్పారు. దాదాపు 13,800 మందికి ట్వీట్ లు తిరిగి పంపించారు. ఇప్పటికే పికు చిత్రం విజయంతో సంతోషంగా ఉన్న ఆయన వజీర్ అనే చిత్రం ద్వారా కనిపించనున్నారు. ఇందులో ఆయన పక్షవాతం సోకిన చెస్ క్రీడాకారుడిగా కనిపిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement