సూపర్ స్టార్కు విలన్గా యంగ్ హీరో | Vishal to play Villain in Mohan lal, unni krishnan Movie | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్కు విలన్గా యంగ్ హీరో

Jan 28 2017 2:19 PM | Updated on Sep 5 2017 2:21 AM

సూపర్ స్టార్కు విలన్గా యంగ్ హీరో

సూపర్ స్టార్కు విలన్గా యంగ్ హీరో

సౌత్ నటులు కూడా హీరో విలన్ అన్న తేడా లేకుండా పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటే ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అవుతున్నారు.

సౌత్ నటులు కూడా హీరో విలన్ అన్న తేడా లేకుండా పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటే ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ హీరోలు ఈ లిస్ట్లో ఒక అడుగు ముందే ఉన్నారు. ఇప్పటికే ఆర్య, ఆది లాంటి హీరోలు నెగెటివ్ పాత్రల్లో ఆకట్టుకోగా తాజాగా మరో యంగ్ హీరో కూడా ఈ లిస్ట్లో చేరబోతున్నాడు.

కోలీవుడ్ హీరోగా నిర్మాతగా నడిగర్ సంఘం నేతగా దూసుకుపోతున్న విశాల్.. తనలోని మరో టాలెంట్ను చూపించబోతున్నాడు. ఇన్నాళ్లు యాక్షన్ హీరో ఇమేజ్తో ఆకట్టుకున్న విశాల్ త్వరలో సూపర్ స్టార్ సినిమాలో విలన్ పాత్రలో అలరించనున్నాడు. మలయాళ దర్శకుడు ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో విశాల్ హీరోగా నటించేందుకు అంగీకరించాడు.

ఈ ఇద్దరు హీరోలకు తమ సొంత భాషలతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండటంతో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో ఒకే సారి తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement