
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో పరభాషా నటులు కూడా పెద్ద సంఖ్యలో నటిస్తున్నారు. ఇప్పటికే సైరాలో నటిస్తున్న కన్నడ స్టార్ హీరో సుధీప్ క్యారెక్టర్‌ను రివీల్ చేసిన చిత్రయూనిట్, త్వరలో తమిళ నటుడు విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను రివీల్ చేయనున్నారట.
సైరాలో విజయ్ సేతుపతి.. నరసింహారెడ్డికి కుడిభుజంగా కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. కథ పరంగా విజయ్ పాత్ర తమిళుడన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు సినిమాతోలో చిరు, విజయ్ ల మధ్యే వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయన్న ప్రచారం జరుగుతోంది. త్వరలోనే విజయ్ పాత్రకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు సైరా యూనిట్.