బిజీ షెడ్యుల్‌కు ముందు ప్రశాంతంగా చరణ్‌ | Upasana Tweets About Ram Charan | Sakshi
Sakshi News home page

చెర్రీ పిక్‌ను పోస్ట్‌ చేసిన ఉపాసన

May 21 2018 11:11 AM | Updated on May 21 2018 11:44 AM

Upasana Tweets About Ram Charan - Sakshi

రంగస్థలం సినిమాతో రికార్డుల దుమ్ము దులిపారు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌. నాన్‌ బాహుబలి రికార్డులతో సమ్మర్‌ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా ఈ చిత్రం నిల్చింది. ప్రస్తుతం రాంచరణ్‌, బోయపాటి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. మొదటి షెడ్యుల్‌ షూటింగ్‌ ఇటీవలే పూర్తి చేసుకుని రెండో షెడ్యుల్‌ కోసం బ్యాంకాక్‌ వెళ్లింది చిత్రబృందం. అక్కడి బిజీ షెడ్యుల్‌లో పాల్గొంటున్న చెర్రీ సోమవారం ఉదయాన... ప్రశాంతంగా  ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్న ఫోటోను ఆయన సతీమణి ఉపాసన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 

బ్యాంకాక్‌లో చెర్రీ, కైరా అద్వాణీలు వర్కౌట్లు చేస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. ఉదయం పూట .. చెర్రీ లాన్‌లో నిల్చొని కాఫీ తాగుతూ ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఒక ఫోటోను ఉపాసన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘నిన్ను నువ్వు మార్చుకోవడానికి, పాజిటివ్‌ ఎనర్జీని పొందడానికి ఈ సమయం ఎంతో ప్రధానమైనది’ అంటూ ట్వీట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement