తమిళం నుంచి ట్రాఫిక్ | 'Traffic' Movie Releasing on Feb 14th | Sakshi
Sakshi News home page

తమిళం నుంచి ట్రాఫిక్

Feb 5 2014 12:24 AM | Updated on Sep 2 2017 3:20 AM

తమిళం నుంచి ట్రాఫిక్

తమిళం నుంచి ట్రాఫిక్

శరత్‌కుమార్, రాధిక, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రధారులుగా షాహిద్ ఖదీర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘చెన్నయ్‌ఇల్ ఒరు నాళ్’.

శరత్‌కుమార్, రాధిక, ప్రకాష్‌రాజ్ ప్రధాన పాత్రధారులుగా షాహిద్ ఖదీర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘చెన్నయ్‌ఇల్ ఒరు నాళ్’. ఈ చిత్రం తెలుగులో ‘ట్రాఫిక్’ పేరుతో విడుదల కానుంది. తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ అనువాద చిత్రానికి నిర్మాత. ఈ నెల 14న విడుదల కానున్న ఈ చిత్రం ప్రచార చిత్రాలను ఇటీవల విడుదల చేశారు. ‘‘తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రానికి మలయాళంలో రూపొందిన ‘ట్రాఫిక్’ సినిమా మాతృక. మోహన్‌లాల్ అందులో ప్రధాన పాత్ర పోషించారు. మలయాళం, తమిళంలో విజయం సాధించినట్లుగానే తెలుగులో కూడా ఈ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం’’ అని నిర్మాత అన్నారు. కె.వి.వి.సత్యనారాయణ, శివప్రసాద్ వై., టి.ప్రసన్నకుమార్, సురేష్ కొండేటి, సాహితి, సాయివెంకట్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement