అక్కడలానే ఇక్కడా..! | Traffic Movie Audio Launched | Sakshi
Sakshi News home page

అక్కడలానే ఇక్కడా..!

Feb 13 2014 12:08 AM | Updated on Sep 2 2017 3:38 AM

అక్కడలానే ఇక్కడా..!

అక్కడలానే ఇక్కడా..!

మలయాళంలో ఘనవిజయం సాధించి, ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతోన్న ‘ట్రాఫిక్’ చిత్రాన్ని అదే పేరుతో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులోకి విడుదల చేయనున్నారు.

 మలయాళంలో ఘనవిజయం సాధించి, ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతోన్న ‘ట్రాఫిక్’ చిత్రాన్ని అదే పేరుతో తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలుగులోకి విడుదల చేయనున్నారు. భీమవరం టాకీస్, గోల్డ్‌స్టార్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని అనువదించాయి. శరత్‌కుమార్, ప్రకాష్‌రాజ్, రాధిక, ప్రసన్న, చేరన్ ముఖ్య తారలు. అతిథి పాత్రను సూర్య చేశారు. మెజో జోసెఫ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ వేడుకలో అతిథిగా పాల్గొన్న కె. అచ్చిరెడ్డి ఆడియో సీడీని ఆవిష్కరించి, మరో అతిథి కేవీవీ సత్యనారాయణకు అందజేశారు. 
 
 ఇంకా దామోదరప్రసాద్, సముద్ర, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. ‘‘నిర్మాతగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు, మంచి లాభాలను కూడా చవిచూ డాలనే ఆశయంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాను. ఈ సినిమాని తెలుగులో అనువదించడానికి సహకరించిన శరత్‌కుమార్, రాధికలకు ధన్యవాదాలు. రేపు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు రామసత్యనారాయణ. ఈ చిత్రంలో మంచి పాత్ర చేశానని, మలయాళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం తెలుగువారిని కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందని ప్రసన్న చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement