సంచలన విషయాలు వెల్లడించిన నటి

Tinaa Datta Opens Up on Depression After Being in Abusive Relationship - Sakshi

బాలీవుడ్‌ టీవీ నటి టీనా దత్తా తన జీవితంలో ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాల గురించి మీడియాతో చెప్పుకొచ్చారు. ఐదేళ్లపాటు కలిసి ఉన్న ఓ వ్యక్తి తనను శారీరకంగా, మానసికంగా, మాటలతో హింసించాడని.. దాంతో తాను డిప్రెషన్‌కు గురయ్యానని తెలిపారు. టీనా మాట్లాడుతూ.. ‘నా వ్యక్తిగత జీవితం గురించి మీడియా ముందు మాట్లాడతానని ఎప్పుడు అనుకోలేదు. ఎంతో నరకం అనుభవించాను. దాంతో ఇలా మాట్లడక తప్పడం లేదు. కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దాదాపు ఐదేళ్ల నుంచి అతడిని ప్రేమిస్తున్నాను. తనకు ఇండస్ట్రీతో సంబంధం లేదు. మొదట్లో బాగానే ఉండేవాడు. రానురాను అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. మాటలతో, చేతలతో నన్ను హింసించడం ప్రారంభించాడు’ అని తెలిపారు.

‘మానసికంగా, శారీరకంగా బాధించేవాడు. భరించే ఓపిక లేక అతడితో బంధానికి స్వస్తి పలికాను. ఆ సమయంలో నేను చాలా డిప్రెషన్‌కు గురయ్యాను. మనుషుల మీద నమ్మకం పోయింది. ఎవరితో కలవలేకపోయేదాన్ని. ఒంటరిగా కూర్చుని బాధపడేదాన్ని. మేకప్‌ రూంలో కూర్చుని ఏడ్చేదాన్ని. ఆ తర్వాత నా కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయంతో నెమ్మదిగా కోలుకోవడం ప్రారంభించాను. ప్రస్తుతం నా దృష్టి అంతా కెరీర్‌ మీదే పెట్టాను. జీవితంలో స్థిరపడాలి.. మంచి వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాను. అయితే అతడు పరిశ్రమకు చెందిన వాడు కాకుడదు. కానీ ఇప్పటి వరకు అలాంటి వ్యక్తి తారసపడలేదు’ అని తెలిపారు టీనా.

ఈ ఏడాది మార్చిలో దయాన్‌ షూటింగ్‌ సమయంలో నటుడు మోహిత్‌ మల్హోత్రా తనను అనుచితంగా తాకినట్లు టీనా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరి ఇద్దరి మధ్య విబేధాలు ముగిసిపోయినట్లు ప్రకటించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top