వివాదంలో సూపర్ స్టార్ అల్లుడు | The High Court of Madras has issued notices to Tamil actor Dhanush over charges of contempt of Court. | Sakshi
Sakshi News home page

వివాదంలో సూపర్ స్టార్ అల్లుడు

Feb 19 2016 11:32 AM | Updated on Oct 1 2018 5:40 PM

వివాదంలో సూపర్ స్టార్ అల్లుడు - Sakshi

వివాదంలో సూపర్ స్టార్ అల్లుడు

కోర్టు ధిక్కారణ నేర కింద ప్రముఖ తమిళ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ కు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

చెన్నై: కోర్టు ధిక్కారణ  నేరం కింద ప్రముఖ  కోలీవుడ్  హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్కు మద్రాస్ హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది.  టీవీ సీరియల్ , మూవీ డబ్బింగ్ కళాకారులు దాఖలు చేసిన పిటిషన్ను  విచారణకు స్వీకరించిన కోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం, టీవీ సీరియల్‌ కళాకారుల సంఘంలో సభ్యులుగా ఉన్న తమ వేతనాలలో 10 శాతం యూనియన్కు చెల్లించే విషయంలో కోర్టు ఉత్తర్వులను  ఉల్లంఘించారంటూ ధనుష్ సహా మరికొంతమంది ప్రముఖులపై  డబ్బింగ్ కళాకారులు కోర్టులో ఫిర్యాదు చేశారు.  స్థానిక కోడంబాక్కంకు చెందిన మతియాజగన్,  సాలిగ్రామంకు చెందిన ఆర్‌ మహాలక్ష్మి, పీఆర్‌ కణ్ణన్లు హైకోర్టులో ఈ పిటీషన దాఖలు చేశారు.

వివరాల్లోకి వెళితే హీరో, హీరోయిన్లతోపాటు ఇతర నటీనటులకు  డబ్బింగ్ చెప్పే కళాకారులు తమ వేతనంలో పది శాతాన్ని యూనియన్ కు చెల్లించే  సంప్రదాయం గతంలో ఉండేది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఈ చెల్లింపులను నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.  కానీ ధనుష్ కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారు.  కళాకారులకు ఇవ్వాల్సిన చెల్లింపులో 10శాతం కోతను యథావిధిగా కొనసాగిస్తున్నారు.  దీనిపై వారు కోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి టీఎస్‌ శివజ్ఞానం.. దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ  ఆదేశాలు జారీ చేశారు.  అసోసియేషన్ సెక్రటరీ ప్రకాష్, అధ్యక్షుడు సెల్వరాజ్,  దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం అధ్యక్షుడు, నిర్మాత  థానులకు ఈ  నోటీసులిచ్చింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement