నోట్ల రద్దు ఇతివృత్తంగా మోసడి

Tamil Movie Mosadi Based on Demonetisation - Sakshi

తమిళసినిమా: పెద్ద నోట్ల రద్దు ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న చిత్రం మోసడి అని ఆ చిత్ర దర్శకుడు జగదీశన్‌ తెలిపారు. విజూ హీరోగా నటిస్తున్న ఇందులో హీరోయిన్‌గా పల్లవిడోరా నటిస్తోంది. జయకుమార్‌ ఎన్‌సీబీ.విజయన్, వెంకటాచలం. నీలు సుకుమారన్, ఓఎస్‌.శరవణన్, మోహన్‌ ముఖ్యపాత్రలను పోషిస్తున్న దీనికి ఆర్‌.మణికంఠన్‌ ఛాయాగ్రహణం, షాజహాన్‌ సంగీతం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ మోసడి చిత్రం పూర్తిగా నిజ జీవితంలో జరిగిన సంఘటనలతో తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు.

2016 నవంబర్‌ నెల 8వ తేదీన సాయంత్రం అనూహ్యంగా రూ.1000, 500 నోట్లు చెల్లవు అన్న ప్రకటన వెలువడిన తరువాత బడాబాబులందరూ తమ అధికారాన్ని ఉపయోగించుకుని పెద్ద నోట్లను ఎలా రూ.2000నోట్లకు మార్చుకున్నారు? సాధారణ ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారు. ఆ ప్రకటనతో దొడ్డి దారిన ఎలాంటి మోసాలు జరిగాయి? లాంటి యథార్థ అంశాలతో కూడిన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా మోసడి ఉంటుందని తెలిపారు. జరిగిన సంఘటనలే ఈ∙చిత్రంలో చూపించామని, అదే విధంగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి సెన్సార్‌ కూడా అయిపోయిందని తెలిపారు. కమర్శియల్‌ అంశాలతో కూడిన జనరంజకంగా సాగే మోసడి చిత్రాన్ని ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 180 థియేటర్లలో విడుదల చేయనున్నట్లు దర్శకుడు జగదీశన్‌  తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top