'నాకెవరూ అవకాశాలు ఇవ్వలేదు'

Tamannah Bhatia Comments On Nepotism - Sakshi

చెన్నై : తనకు ఎవరూ అవకాశాలను కల్పించలేదని నటి తమన్నా పేర్కొంది. ప్రస్తుతం నటి తమన్నా దక్షిణాదిలో అగ్ర నటీమణుల్లో ఒకరుగా రాణిస్తున్నారు . ముఖ్యంగా ఈ ఉత్తరాది బ్యూటీ తెలుగు, తమిళ భాషల్లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 15 ఏళ్ల వయసులోనే నటిగా సినీరంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు తొలుత బాలీవుడ్లో కథానాయికగా పరిచయం అయింది. అక్కడ ఈమెను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో దక్షిణాదికి మకాం మార్చింది. ఇక్కడ కథానాయికగా వరుసగా అవకాశాలు రావడంతో వాటిని సద్వినియోగం చేసుకుంది. అలా 15 ఏళ్లుగా కథానాయికగా కొనసాగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్లో నేపోటిజం గురించి అక్కడ పెద్దచర్చ జరుగుతోంది.

ఈ విషయంపై నటి తమన్నా స్పందిస్తూ తాను 2005లో చాంద్‌ సా రోషన్‌ సహ్రా అనే చిత్రం ద్వారా కథానాయికగా బాలీవుడ్‌లో పరిచయం అయినట్లు చెప్పింది. తాను ముంబై నుంచి దక్షిణాదికి వచ్చేటప్పుడు తనకు అవకాశం ఇవ్వడానికి ఎవ్వరూ సాయం చేయలేదని పేర్కొంది. తన సొంత ప్రయత్నంలోనే దక్షిణాదిలో టాప్‌ హీరోయిన్‌ అంతస్తును దక్కించుకున్నట్లు చెప్పింది.తన బాలీవుడ్‌ కల మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది. అలా 2013లో హిమ్మత్వాలా చిత్రం ద్వారా మరోసారి తన బాలీవుడ్లో అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. అది ఆమెకు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. మళ్లీ దక్షణాదినే నమ్ముకుంది. ఆ తర్వాత కూడా ఇటీవల ప్రభుదేవా దర్శకత్వంలో ఖామోషీ అనే హిందీ చిత్రంలో నటించింది. అది ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఇలాంటి సమయంలో తమన్నా ఇటీవల ఒక భేటీలో నేపోటిజం గురించి మాట్లాడుతూ నేపోటిజం ప్రభావం సినీ రంగంలో ఎంట్రి వరకే పనిచేస్తుందని చెప్పింది. ఆ తర్వాత జయాపజయాలు అనేవి ప్రతిభపైనే ఆధారపడి ఉంటాయని పేర్కొంది. వారసత్వం అన్నది సినిమా రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఉంటుందని పేర్కొంది. పలువురు ప్రముఖుల వారసులు ఎవరి సాయం లేకుండానే ఈ రంగంలో రాణిస్తున్నారని తమన్నా చెప్పింది.  
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top