కలైజ్ఞానం నివాసానికి రజనీకాంత్‌ | Superstar Rajinikanth Visits Kalaignanam New House In Chennai | Sakshi
Sakshi News home page

కలైజ్ఞానం నివాసానికి రజనీకాంత్‌

Oct 7 2019 2:23 PM | Updated on Oct 7 2019 2:23 PM

Superstar Rajinikanth Visits Kalaignanam New House In Chennai - Sakshi

సాక్షి, చెన్నై : ప్రముఖ నిర్మాత-రచయిత కలైజ్ఞానం నివాసానికి దక్షిణాది సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఆదివారం విచ్చేశారు. కలైజ్ఞానం, ఆయన కుటుంబసభ్యులు ...రజనీకాంత్‌ను సాదరంగా ఆహ్వానించారు. కాగా  రజనీకాంత్‌  ఆదిలో ప్రతినాయకుడిగా ఎదిగిన విషయం తెలిసిందే. అలాంటి రోజుల్లో ఆయనను హీరోగా పరిచయం చేసి ‘భైరవి’ (1978) అనే చిత్రాన్నికలైజ్ఞానం నిర్మించారు. ఆ చిత్రం రజనీకాంత్‌ సినీ జీవితాన్నే మార్చేసింది. అలాంటి నిర్మాత నివసించడానికి సొంతంగా ఒక ఇల్లు కూడా ఏర్పరచుకోలేకపోయారు. అద్దె ఇంట్లోనే జీవనం కొనసాగిస్తున్న కలైజ్ఞానంకు... రజనీకాంత్‌ సుమారు రూ.కోటి విలువ చేసే ఇంటిని కానుకగా ఇచ్చారు. ఆ నివాసానికే ఇవాళ రజనీకాంత్‌ వెళ్లారు. దీంతో రజనీ తన నివాసానికి రావడంతో  కలైజ్ఞానం సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement