
సన్నీ డియోల్
నెపోటిజం (బంధుప్రీతి) అనే టాపిక్ ఏ ఇండస్ట్రీలో అయినా చాలా కామన్. కానీ కేవలం దాని వల్లే ఇండస్ట్రీలో మనం నిలబడం అంటున్నారు బాలీవుడ్ సీనియర్ నటుడు సన్నీ డియోల్. తనయుడు కరణ్ డియోల్‌ను ‘పల్ పల్ దిల్ కే పాస్’ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు సన్నీ డియోల్ . నెపోటిజమ్ గురించి సన్నీ మాట్లాడుతూ – ‘‘ప్రతిసారి ఇదే కొశ్చన్‌ను ఎందుకు అడుగుతారో అర్థం కాదు.
నెపోటిజమ్ వల్ల వేరే వాళ్లు అవకాశాలు కోల్పోతున్నారనుకోవడం పొరబాటు. ఈరోజు నేనిలా ఉన్నానంటే అది కేవలం మా నాన్న పరిచయం చేయడం వల్లే అనుకోవడం సరి కాదు. ఫస్ట్ సినిమా వరకే బ్యాగ్రౌండ్ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత మన ప్రతిభ, కష్టం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ రెండూ లేకపోతే ఎంత ఈజీగా ఎంటర్ అయ్యామో అంతే ఈజీగా ఇండస్ట్రీ నుంచి ఎగ్టిట్ అయిపోతాం’’ అన్నారు.