మా తమ్ముడు కూడా వేధిస్తున్నాడు : హృతిక్‌ సోదరి

Sunaina Roshan Says Rakesh Roshan Slapped Her Over Her Relationship With Muslim Guy - Sakshi

తన తమ్ముడు హృతిక్‌ రోషన్‌ సహా కుటుంబ సభ్యులంతా తనను వేధిస్తున్నారని బాలీవుడ్‌ దర్శక, నిర్మాత రాకేష్‌ రోషన్‌ కూతురు సునయన సంచలన ఆరోపణలు చేశారు. ముస్లిం వ్యక్తిని ప్రేమించిన కారణంగా తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సునయన రోషన్‌ తన ఇంట్లోనే వేధింపులకు గురవుతున్నారంటూ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ సోదరి రంగోలి వరుస ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి సునయన మాట్లాడుతూ.. ‘ ఎప్పటిలాగానే నరకంలో జీవిస్తున్నా. రంగోలి ట్వీట్లు చదివాను. ఆమె చెప్పినవన్నీ నిజాలే. తన ద్వారానైనా నాకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. నేను ఈరోజు కంగనా, రంగోలీలను కలుస్తున్నాను. వారు మాత్రమే నాకు న్యాయం చేయగలరు’ అని పేర్కొన్నారు.

తన ప్రేమ విషయం గురించి మాట్లాడుతూ..‘ గతేడాది రుహైల్‌ అమీన్‌ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కానీ అతడు ముస్లిం అన్న కారణంగా మా నాన్న మా రిలేషన్‌షిప్‌ను అంగీకరించలేదు. నన్ను తీవ్రంగా కొట్టారు. అతడు ఒక ఉగ్రవాది అతడిని పెళ్లి చేసుకుంటావా అంటూ హింసించారు. తను ఒక జర్నలిస్టు అని చెప్పినా వినలేదు. ఈ విషయంలో హృతిక్‌ కూడా నాకు సహాయం చేయలేదు. తను కూడా నన్ను వేధిస్తున్నాడు. రుహైల్‌తో ప్రేమ అతడికి ఇష్టం లేదు. మా నాన్న గైడెన్స్‌లో తను కూడా ఆయన లాగే ప్రవర్తిస్తున్నాడు. నా పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. ఇంట్లో వాళ్లంతా నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు అని కుటుంబ సభ్యులపై సునయన సంచలన ఆరోపణలు చేశారు. తను కంగనాను కలిసి తన దుస్థితిని వివరిస్తానని, ఆమె తనకు న్యాయం జరిగేలా చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా గతంలో హృతిక్‌- కంగనాల మధ్య విభేదాలు తలెత్తిన సమయంలో సునయన కంగనాకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top