సుసానే ఖాన్‌ విషయంలో ఇలా లేరు కదా!

Sunaina Roshan Boyfriend Ruhail Amin Reaction On Roshans Stand - Sakshi

హృతిక్‌ రోషన్‌ సోదరి సునయిన రోషన్‌తో తనకున్న బంధం గురించి జర్నలిస్టు రుహైల్‌ అమీన్‌ తొలిసారిగా స్పందించారు. కేవలం మతం కారణంగానే సునయన కుటుంబ సభ్యులు తనను ద్వేషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హృతిక్‌ మాజీ భార్య(సుసానే ఖాన్‌) విషయంలో వారికి అడ్డురాని మతం..తన విషయంలో మాత్రం ఎందుకు అడ్డు వస్తుందో తెలియడం లేదన్నారు. ఇలా జరగడం నిజంగా దురదృష్టకరమని పేర్కొన్నారు. ముస్లిం వ్యక్తిని ప్రేమించిన కారణంగా తనను చిత్ర హింసలకు గురిచేస్తున్నారని సునయన సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన రుహైల్‌...‘ ఓ ఎంటర్‌టేన్‌మెంట్‌ చానల్‌లో పనిచేసే సమయంలో మొదటిసారి తనను కలిశాను. ఆ తర్వాత ఇద్దరం సోషల్‌ మీడియాలో టచ్‌లో ఉండేవాళ్లం. అభిప్రాయాలు పంచుకునే వాళ్లం. ఈ క్రమంలో సునయన నాతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంది. అందుకు తన కుటుంబం మద్దతు కోరింది. కానీ వారిలా పూర్తి వ్యతిరేకంగా మారతారని తను ఊహించలేదు. ఆమె తండ్రి రాకేష్‌ రోషన్‌ నన్ను ఓ ఉగ్రవాదిగా ముద్రవేయడం సరికాదు. వేరే మతానికి చెందిన వాడిని గనుకే నన్నిలా అంటున్నారు. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరు ఖండించాలి. అదే విధంగా కొడుకు విషయంలో అడ్డురాని మతం సునయన విషయంలోనే ఎందుకు అడ్డువస్తుందో గమనించాలి’ అని పేర్కొన్నారు.

ఇక తన ప్రేమ విషయం గురించి సునయన మాట్లాడుతూ..‘ గతేడాది రుహైల్‌ అమీన్‌ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డాను. కానీ అతడు ముస్లిం అన్న కారణంగా మా నాన్న మా రిలేషన్‌షిప్‌ను అంగీకరించలేదు. నన్ను తీవ్రంగా కొట్టారు. అతడు ఒక ఉగ్రవాది అతడిని పెళ్లి చేసుకుంటావా అంటూ హింసించారు. తను ఒక జర్నలిస్టు అని చెప్పినా వినలేదు. ఈ విషయంలో హృతిక్‌ కూడా నాకు సహాయం చేయలేదు. తను కూడా నన్ను వేధిస్తున్నాడు. రుహైల్‌తో ప్రేమ అతడికి ఇష్టం లేదు. మా నాన్న గైడెన్స్‌లో తను కూడా ఆయన లాగే ప్రవర్తిస్తున్నాడు. నా పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు. ఇంట్లో వాళ్లంతా నన్ను తీవ్రంగా వేధిస్తున్నారు’ అని కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top