మొదటిరోజే రూ. 35 కోట్లు దాటిన కలెక్షన్లు | 'Sultan' mints over Rs 35 crore on opening day | Sakshi
Sakshi News home page

మొదటిరోజే రూ. 35 కోట్లు దాటిన కలెక్షన్లు

Jul 7 2016 3:50 PM | Updated on Sep 4 2017 4:20 AM

మొదటిరోజే రూ. 35 కోట్లు దాటిన కలెక్షన్లు

మొదటిరోజే రూ. 35 కోట్లు దాటిన కలెక్షన్లు

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ మల్లయోధుడిగా నటించిన ‘సుల్తాన్’ సినిమా.. అతడి ఈద్ సెంటిమెంటుకు తగ్గట్లుగానే అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించింది.

ఏదైనా సినిమా విడుదల అయ్యిందంటే మొదటిరోజు 10-15 కోట్ల కలెక్షన్లు వస్తే సూపర్ హిట్ అంటారు. అలాంటిది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ మల్లయోధుడిగా నటించిన ‘సుల్తాన్’ సినిమా.. అతడి ఈద్ సెంటిమెంటుకు తగ్గట్లుగానే అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించింది. మొదటిరోజు ఏకంగా రూ. 36.5 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు యష్ రాజ్ ఫిలింస్ ప్రొడక్షన్ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2016 సంవత్సరంలో ఇప్పటివరకు విడుదలైన అన్ని సినిమాల్లోకి ఇదే అత్యధిక ఓపెనింగ్ అని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ కూడా చెప్పారు. దీని తర్వాత ఫ్యాన్ సినిమాకు మొదటి రోజు రూ. 19.20 కోట్లు వచ్చాయి. ఉడ్తా పంజాబ్ సినిమా రూ. 10.05 కోట్ల కలెక్షన్లు సాధించింది. అయితే.. సల్మాన్ హీరోగా నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాకు మాత్రం దీనికంటే ఎక్కువగా మొదటిరోజు ఏకంగా రూ. 40.35 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి.

సల్లూభాయ్ ఈద్ సెంటిమెంట్ ప్రకారం చూసుకున్నా.. ప్రస్తుతం వరుసగా ఐదు రోజుల సెలవులు రావడం చూసుకున్నా ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని బాలీవుడ్ పండితులు చెబుతున్నారు. ఈ ఐదు రోజుల్లో సుల్తాన్ సినిమా హరికేన్ సృష్టించడం ఖాయమని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement