breaking news
slaman khan
-
ముద్దంటే చేదే అంటున్న స్టార్స్... ఎందుకు?
ప్రస్తుతం అన్ని భాషల్లోని సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాలు సాధారణమయ్యాయి. ముఖ్యంగా లిప్‌కిస్ సీన్స్ అయితే దాదాపుగా సగం సినిమాల్లో అంతకన్నా ఎక్కువగా వెబ్‌సిరీస్‌లలో సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ మన భారతీయ సంప్రదాయ జీవనశైలి దృష్ట్యా ఇప్పటికీ ఆ తరహా దృశ్యాలు ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూనే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకునో లేక వ్యక్తిగతంగా అసౌకర్యంగా అనిపించో పలువురు సినీ తారలు తాము అలాంటి దృశ్యాలు, ముఖ్యంగా లిప్ కిస్ సన్నివేశాల్లో నటించమనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటివారి జాబితాలో తాజాగా దక్షిణాది నటుడు విశాల్ కూడా చేరారు. ఇటీవలే తన పెళ్లి నిశ్చితార్ధం చేసుకున్న ఈ హీరో ఇకపై తెర ముద్దులకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు.అలా ఆన్ స్క్రీన్ కిస్‌లకు దూరంగా ఉండే నటుల్లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒకరు. ఆయన ఎప్పటినుంచో లిప్‌కిస్ సీన్ల కి దూరంగా ఉంటూ వచ్చారు. ఇటువంటి సన్నివేశాలు తనకు అసౌకర్యకరం అనిపిస్తాయనీ, తన అభిమానులు కూడా కుటుంబంతో కలిసి చూడలేరని అంటున్నాడు. అదే విధంగా తొలినాళ్ల నుంచీ షారూఖ్ ఖాన్ కూడా అదే బాటలో ఉన్నాడు. అయితే జబ్ తక్ హై జాన్ , జీరో సినిమాల్లో మాత్రం దర్శక నిర్మాతల కోరిక మేరకు తప్పనిసరై చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఇక మళయాళ స్టార్ ఉన్నీ ముఖుందన్ కూడా ఆన్ స్క్రీన్ కిస్సింగ్కు విముఖమే. ఆయన ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించడం వల్ల అలాంటి స్క్రిప్ట్స్ ఆయన దగ్గరకు రావు. ప్రేమ ప్రదర్శనకు కిస్ తప్పనిసరి కాదంటున్న ఆయన; కుటుంబ ప్రేక్షకులందరు చూడగలిగే చిత్రాలు మాత్రమే చేస్తానంటున్నాడు. అయితే మార్కో పేరుతో ఈ హీరో భయంకరమైన హింసను చూపించడంతో కుటుంబ సమేతంగా వచ్చిన వారు ధియేటర్లు వదిలి వెళ్లిపోవడం గమనార్హం. నటి జెనీలియాలాగే ఆమె భర్త నటుడైన రితేశ్ దేశ్‌ముఖ్ సైతం ముద్దంటే చేదే అంటున్నాడు. మన హీరోల్లో శర్వానంద్‌ది కూడా ఇదే పంథా అయితే మహా సముద్రం వంటి ఒకటి రెండు సినిమాల్లో మాత్రం కొంచెం పక్కకి జరిగినట్టు కనిపిస్తుంది. తెలుగులో అల్లు అర్జున్, మహేష్ బాబులతో లిప్ టు లిప్ టచ్ చేసిన కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి అనంతరం పెదాలపై ముద్దులకు నో అని చెప్పేసింది. అలాగే మహానటి సినిమా ద్వారా సాధించిన క్లీన్ ఇమేజ్ను కాపాడుకుంటూ కీర్తి సురేష్ కూడా వాటికి దూరంగానే ఉంటోంది. ఒక తెలుగు చిత్రంలో కధ ప్రకారం లిప్–కిస్ సన్నివేశం ఉందని చెప్పడంతో ఆమె ఆ సినిమా అవకాశాన్ని కాదనుకుంది. ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా కూడా నో కిస్సింగ్ ప్లీజ్ అంటున్నారు. దాదాపు 18ఏళ్ల పాటు లిప్ కిస్‌లకు, మితిమీరిన ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉన్న తమన్నా ఇప్పుడు ఆ రెండింటికీ సై అంటున్నారు. దక్షిణాది హీరో హీరోయిన్లు ఇంకా ఈ ముద్దు సీన్ల విషయంలో ముదిరిపోయినట్టు కనిపించడం లేదు గానీ బాలీవుడ్ మాత్రం ఓ రేంజ్లో ముదిరిపోయింది.ఈ సందర్భంగా ఈ కిస్సింగ్ సీన్లకు సంబంధించి హీరో హీరోయిన్లు అందరూ ఒకెత్తయితే బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ ఒక్కడే ఒకెత్తుగా చెప్పాలి. సినిమాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచీ తెరపై ముద్దుల పంట పండిస్తున్న ఈయన సీరియల్ కిస్సర్ కిరీటం అందుకున్న ఏకైక భారతీయ నటుడిగా నిలిచాడు. ముద్దులు పెట్టి పెట్టి ముఖం మొత్తిందో లేక కొత్తగా వచ్చిన భార్య తిట్టిందో గానీ ఈ హీరో ఇక లిప్ కిస్‌లకు నో అంటూ నిర్ణయం తీసుకోవడం సంచలనం సృష్టించింది. ఓ ఏడేళ్ల క్రితం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొంత కాలం క్రితం వరకూ కఠినంగానే అమలు చేసిన ఇమ్రాన్ ఆ తర్వాత తన నిర్ణయానికి కొన్ని సవరణలు చేశాడు. ‘‘కండలు చూపించని సల్మాన్‌ను ముద్దులు కురిపించని ఇమ్రాన్‌ను ప్రేక్షకులు జీర్ణించుకోలేరు’’ అంటూ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఆయన... తన భార్య కోరిక మేరకు ఎడా పెడా ఆ సీన్లు చేయనని. తప్పనిసరైతేనే ఓకే అంటానంటున్నాడు. -
తేరే బినా పాటకు నెటిజన్లు ఫిదా..
ముంబై: బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్, హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్‌లా కొత్త రొమాంటిక్ ట్రాక్ ‘తేరే బినా’ వీడియో సాంగ్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఈ పాటలో వారిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది అంటూ వారి అభిమానులు మురిసిపోతున్నారు. కాగా ఈ పాటను మంగళవారం భాయిజాన్ తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. మరో విషయం ఏంటంటే ఈ పాటను స్వయంగా సల్మాన్ చిత్రీకరించాడు. అంతేకాదు పాటను కూడా తనే పాడాడు. ఇక పాటలో గడ్డంతో ఉన్న భాయిజాన్‌ను చూసి నెటిజన్లు ‘‘సల్మాన్ గడ్డంతో మరింత హ్యండ్ సమ్‌గా ఉన్నాడు’ అని ‘జాక్వలిన్ మేకప్, క్యాస్టుమ్స్ చాలా స్టైలిష్‌గా ఉన్నాయి’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. (సల్మాన్ ‘తేరే బినా’ టీజర్ విడుదల) సల్మాన్ ఈ పాటను తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేస్తూ.. ‘లాక్డౌన్లో మీకు ఇంకాస్తా వినోదాన్ని అందించేందుకు మా కొత్త ట్రాక్ ‘తేరె బినా’ వచ్చేసింది. ఈ న్యూ రొమాంటిక్ ట్రాక్ వినండి’ అంటూ షేర్ చేశారు. అంతేగాక ‘‘నేను పాడిన ఈ పాటకు నేనే దర్శకుడిని, నిర్మాతను. అంతేగాక చిత్రీకరణ కూడా నేనే చేశాను. ఇప్పుడు మీ కోసం పోస్టు కూడా చేస్తున్నా. ఈ పాట వినండి, పాడండి. మళ్లీ ఇంట్లో చిత్రీకరించి రీపోస్టు చేయండి, షేర్ చేయండి.. ట్యాగ్ చేయండి.. #TereBina’’ అంటూ తన ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. కాగా ఈ పాటకు సంబంధించిన షూటింగ్ మొత్తం పన్వెల్‌లోని సల్మాన్ ఫాం హౌజ్‌లో జరిగింది. ఈ పాట చిత్రీకరణ బాధ్యతను జాక్వలిన్ దగ్గరుండి చూసుకున్నట్లు ఆమె ఈ పాట ప్రమోషన్ ఇంటర్య్వూలో వెల్లడిచింది. (తేరే బినా మ్యూజిక్ వీడియో రిలీజ్) Most Handsome Bollywood Actor Ever...Imagining looking this good at 54,Only Salman Khan can relate..The best of young gen stars cant compete Salman at 54 and thats a fact!!!! #TereBina pic.twitter.com/eN8UnK9nz5 — BeingHonest (@Itsss_Shivam) May 12, 2020 -
‘ముసలి వ్యక్తి డ్యాన్స్ చేస్తున్నట్లుంది’
సల్మాన్ ఖాన్ అభిమానలు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘దబాంగ్ 3’ షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్నెట్లో లీక్ అవ్వడమే కాక తెగ వైరలవుతోంది. సల్మాన్ ఓ సాంగ్ షూటింగ్లో పాల్గొన్న వీడియో ఇది. నర్మదా నది ఒడ్డున షూట్ చేస్తోన్న ఈ పాటలో సల్మాన్ డ్యాన్స్ చూసిన జనాలు ఆయనను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆయనకు డ్యాన్స్ రావడం లేదని కొందరు కామెంట్ చేయగా.. ఓ ముసలి వ్యక్తి డ్యాన్స్ చేయడానికి ప్రత్నిస్తే ఎలా ఉంటుందో సల్మాన్ డ్యాన్స్ చేస్తే అలానే ఉంది.. ఆయన బరువు తగ్గాలి అని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. దాంతో ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ నుంచి తొలగించారు. అయితే ఇలా వీడియో లీక్ అవ్వడం పట్ల సల్మాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైరసీ విషయంలో జాగ్రత్త తీసుకోనందుకు సదరు ఫోటోగ్రాఫర్ మీద మండిపడుతున్నారు. ప్రస్తుతం దబాంగ్ 3 ఇండోర్‌లోని మండలేశ్వర్ మహేశ్వర్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ ప్రదేశాలతో సల్మాన్‌కు ఓ అనుబంధం ఉంది. అర్బాజ్ ఖాన్, సల్మాన్ ఇద్దరు జన్మించింది ఇండోర్‌లో కాగా వీరి తాత మండలేశ్వర్ మహేశ్వర్ ప్రాంతంలోనే పోలీసుగా బాధ్యతలు నిర్వహించారు. -
మొదటిరోజే రూ. 35 కోట్లు దాటిన కలెక్షన్లు
ఏదైనా సినిమా విడుదల అయ్యిందంటే మొదటిరోజు 10-15 కోట్ల కలెక్షన్లు వస్తే సూపర్ హిట్ అంటారు. అలాంటిది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ మల్లయోధుడిగా నటించిన ‘సుల్తాన్’ సినిమా.. అతడి ఈద్ సెంటిమెంటుకు తగ్గట్లుగానే అత్యంత భారీ ఓపెనింగ్స్ సాధించింది. మొదటిరోజు ఏకంగా రూ. 36.5 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లు యష్ రాజ్ ఫిలింస్ ప్రొడక్షన్ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2016 సంవత్సరంలో ఇప్పటివరకు విడుదలైన అన్ని సినిమాల్లోకి ఇదే అత్యధిక ఓపెనింగ్ అని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ కూడా చెప్పారు. దీని తర్వాత ఫ్యాన్ సినిమాకు మొదటి రోజు రూ. 19.20 కోట్లు వచ్చాయి. ఉడ్తా పంజాబ్ సినిమా రూ. 10.05 కోట్ల కలెక్షన్లు సాధించింది. అయితే.. సల్మాన్ హీరోగా నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాకు మాత్రం దీనికంటే ఎక్కువగా మొదటిరోజు ఏకంగా రూ. 40.35 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. సల్లూభాయ్ ఈద్ సెంటిమెంట్ ప్రకారం చూసుకున్నా.. ప్రస్తుతం వరుసగా ఐదు రోజుల సెలవులు రావడం చూసుకున్నా ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని బాలీవుడ్ పండితులు చెబుతున్నారు. ఈ ఐదు రోజుల్లో సుల్తాన్ సినిమా హరికేన్ సృష్టించడం ఖాయమని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు.