రెహ్మాన్ పక్కన పాడటం ఆస్కార్, గ్రామీతో సమానం | Singing alongside Rahman equal to bagging Oscar, Grammy: Darshana | Sakshi
Sakshi News home page

రెహ్మాన్ పక్కన పాడటం ఆస్కార్, గ్రామీతో సమానం

Mar 30 2015 12:05 PM | Updated on May 24 2018 3:01 PM

రెహ్మాన్ పక్కన పాడటం ఆస్కార్, గ్రామీతో సమానం - Sakshi

రెహ్మాన్ పక్కన పాడటం ఆస్కార్, గ్రామీతో సమానం

స్వరమాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ ఆస్కార్, గ్రామీవంటి ఎన్నో అవార్డులతో సమానం అని ప్రముఖ నేపథ్య గాయని దర్శన అన్నారు.

చెన్నై: స్వరమాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ ఆస్కార్, గ్రామీవంటి ఎన్నో అవార్డులతో సమానం అని ప్రముఖ నేపథ్య గాయని దర్శన అన్నారు. ఆయన పక్కనే ఉండి పాడటం అంటే ఇక వర్ణించరాని విషయం అంటూ మురిసిపోయారు. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఓకే కన్మణీ(తెలుగులో ఓకే బంగారం)కి రెహ్మాన్ స్వరాలు అందిస్తున్నారు. ఈ చిత్రం తమిళ తెలుగు భాషల్లో విడుదల కానుండగా ఇందులో మూడు తమిళపాటలు, రెండు తెలుగు పాటలను దర్శన పాడారు.

మరో డ్యూయెట్ పాట మాత్రం రెహ్మాన్తో కలిసి పాడారు. ఈ నేపథ్యంలో ఆమె తన సంతోషాన్ని మీడియాకు వెలిబుచ్చారు. రెహ్మాన్ పక్కన తన పేరు ఉండటాన్ని ఊహించలేకపోతున్నానని, వర్ణించలేకపోతున్నానని అన్నారు. తనకు మాత్రం నిజంగా ఆస్కార్, గ్రామీ పురస్కారాలు పొందినట్లుగా ఉందని అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement