రెండు సినిమాల్లో దేనికి కలెక్షన్లు ఎక్కువ..! | Shah Rukh Khan marches ahead of Hrithik Roshan Kaabil | Sakshi
Sakshi News home page

రెండు సినిమాల్లో దేనికి కలెక్షన్లు ఎక్కువ..!

Jan 26 2017 5:07 PM | Updated on Sep 5 2017 2:11 AM

రెండు సినిమాల్లో దేనికి కలెక్షన్లు ఎక్కువ..!

రెండు సినిమాల్లో దేనికి కలెక్షన్లు ఎక్కువ..!

ఒకే రోజు విడుదలై బాక్సాఫీసు వద్ద పోటీపడ్డ బాలీవుడ్‌ తాజా సినిమాలు రాయిస్, కాబిల్‌ ఓపెనింగ్‌ కలెక్షన్లలో రాయిస్ టాప్లో నిలిచింది.

ముంబై: ఒకే రోజు విడుదలై, బాక్సాఫీసు వద్ద పోటీపడ్డ బాలీవుడ్‌ తాజా సినిమాలు రాయిస్, కాబిల్‌.. ఓపెనింగ్‌ కలెక్షన్లలో రాయిస్ టాప్లో నిలిచింది. షారుక్ ఖాన్ నటించిన రాయిస్, హృతిక్ రోషన్ నటించిన కాబిల్ సినిమాలు బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే.

రాయిస్ తొలి రోజు 20.42 కోట్ల రూపాయలు వసూలు చేయగా, కాబిల్‌కు 10.43 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. రెండో రోజు గురువారం రిపబ్లిక్ డే సెలవు దినం కావడంతో ఈ సినిమాలకు ఇదే స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశముందని బాలీవుడ్ ట్రేడ్‌ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్‌ ట్వీట్ చేశాడు. కాబిల్‌ సినిమాకు విమర్శకుల నుంచి ప్రశంసలు రావడంతో కలెక్షన్లు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. రాయిస్లో షారుక్ గ్యాంగ్స్టర్గా నటించగా, కాబిల్లో హృతిక్ అంధుడి పాత్రలో నటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement