బంపర్‌ చాన్స్‌ | Sayesha Saigal Going to Romance with Surya and Karthi | Sakshi
Sakshi News home page

బంపర్‌ చాన్స్‌

May 18 2018 4:08 AM | Updated on May 18 2018 4:08 AM

Sayesha Saigal Going to Romance with Surya and Karthi - Sakshi

ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే హీరో సూర్య నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లో క్రేజ్‌ మొదలైంది. ఇందుకు నటీనటుల ఎంపిక ఒక కారణం. కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందనున్న ఈ సినిమాలో ఆల్రెడీ మోహన్‌లాల్, అల్లు శిరీష్‌ కీలక పాత్రలు చేయనున్నారు. తాజాగా ఈ సినిమాలో బబ్లీ బ్యూటీ  సాయేషా సైగల్‌ కథానాయికగా నటించనున్నారని టాక్‌. ఒకవేళ ఇదే నిజమైతే సాయేషా బంపర్‌ చాన్స్‌ కొట్టేసినట్లే. మరి.. స్టార్‌ హీరో సూర్య సరసన అంటే బంపర్‌ చాన్సే కదా.

మూడేళ్ల క్రితం నాగార్జున తనయుడు అఖిల్‌ హీరోగా నటించిన ‘అఖిల్‌’ చిత్రంలో ఈ బ్యూటీనే హీరోయిన్‌. ఆ తర్వాత తెలుగు సినిమాకు సైన్‌ చేయలేదు కానీ కోలీవుడ్‌లో మాత్రం జోరుగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్‌సేతుపతి హీరోగా నటించిన ‘జుంగా’, కార్తీ హీరోగా నటించిన ‘కడైకుట్టి సింగమ్‌’, ఆర్య లీడ్‌ రోల్‌ చేస్తున్న ‘గజనీకాంత్‌’ సినిమాలతో బిజీగా ఉన్నారీ బ్యూటీ. కార్తీ నటించిన ‘కుడైకుట్టి సింగమ్‌’, తెలుగులో ‘చినబాబు’ పేరుతో రిలీజ్‌ కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement