గువ్వది ఓ దారి... గోరింకది మరో దారి | sathyadev, priyalal new film is guvva gorinka | Sakshi
Sakshi News home page

గువ్వది ఓ దారి... గోరింకది మరో దారి

May 23 2017 1:34 AM | Updated on Sep 5 2017 11:44 AM

గువ్వది ఓ దారి...   గోరింకది మరో దారి

గువ్వది ఓ దారి... గోరింకది మరో దారి

రెండు రెక్కలు కలిస్తేనే పక్షి గాల్లోకి ఎగురుతుంది. అలాగే, రెండు మనస్తత్వాలు కలిస్తేనే జంట ప్రయాణం బాగుంటుంది.

రెండు రెక్కలు కలిస్తేనే పక్షి గాల్లోకి ఎగురుతుంది. అలాగే, రెండు మనస్తత్వాలు కలిస్తేనే జంట ప్రయాణం బాగుంటుంది. అలాంటి జంటలను గువ్వా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారంటుంటారు. సత్యదేవ్, ప్రియాలాల్‌ జంట ‘గువ్వ గోరింక’ అనేలా ఉంటుంది. కానీ, మనస్తత్వాలే వేర్వేరు. ఇద్దరిదీ చెరో దారి.

విభిన్న మనస్తత్వాలు గల ఈ జంట ప్రయాణం, ప్రేమకథతో రూపొందుతున్న సినిమా ‘గువ్వ గోరింక’. రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడు మోహన్‌ బొమ్మిడి దర్శకత్వంలో ఆకార్‌ మూవీస్‌ పతాకంపై దామురెడ్డి కొసనం, ‘దళం’ జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘‘చక్కని ప్రేమకథా చిత్రమిది. మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన సంఘటనలకు దృశ్యరూపమే ఈ సినిమా’’ అన్నారు నిర్మాతలు. మధుమిత, ప్రియదర్శి, చైతన్య ప్రధాన తారలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: సురేశ్‌ బొబ్బొలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement