లేటుగా అయినా క్యూట్‌గా..

Samantha Cute Respond on Kolamavu Kokila Trailer - Sakshi

తమిళసినిమా: నటి సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం సక్సెస్‌పరంగా టాప్‌ గేర్‌లో ఉన్న క్రేజీ నటి. వివాహానంతరం కథానాయకిగా రాణిస్తున్న రేర్‌ నటి సమంత. మహానటి, రంగస్థలం, తమిళంలో ఇరుంబుతిరై ఇలా వరుసగా హ్యాట్రిక్‌ కొట్టిన నాయకి ఈ బ్యూటీ. ప్రస్తుతం కన్నడ చిత్రం యూటర్న్‌ రీమేక్‌లో నటిస్తోంది. ఇది హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రం. అదే విధంగా తన భర్త నాగచైతన్యతో కలిసి ఒక చిత్రం చేస్తోంది. ఇకపోతే తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించిన సీమరాజా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మరో పక్క విజయ్‌సేతుపతితో సూపర్‌డీలక్స్‌ చిత్రంలో నటిస్తోంది. ఇక నటి నయనతార గురించి అస్సలు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎందుకుంటే లేడీ సూపర్‌స్టార్‌ ఇమేజ్‌ను అందుకున్న నటి. కోలీవుడ్‌లో అగ్రనటిగా రాణిస్తున్న నయనతార చేతినిండా చిత్రాలే. ఈమె గురించి చాలా ప్రచారంలో ఉంది. దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌తో ప్రేమ అని, సహజీవనం చేస్తున్నారని, రహస్యంగా పెళ్లి చేసేసుకున్నారని ఇలా చాలానే.

అయినా నయనతారకు వద్దంటే అవకాశాలు అన్న పరిస్థితి. ఇకపోతే ఈ సంచలన నటి నటించిన కొలమావు కోకిల చిత్రం గురించే ఇప్పుడు చర్చ అంతా. నయనతార  ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రానికి అనిరుద్‌ సంగీతం అందించారు. ఆయన ఈ చిత్రం కోసం ఆరు పాటలకు బాణీలు కట్టారు. అందులో కల్యాణం వయసు... అనే పాటను నటుడు శివకార్తికేయన్‌ రాసి రచయితగానూ అవతారమెత్తారు. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ పాట 5న మార్కెట్‌లోకి విడుదలై విశేష ఆదరణను పొందుతోంది. ఇక చిత్ర ట్రైలర్‌ కూడా విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ టీజర్‌ను ఇప్పటికే 38 లక్షల మంది తిలకించారంటే నమ్మండి.

ఆ టీజర్‌ నచ్చిన వారిలో నటి సమంత ఉంది.ఈ ట్రైలర్‌ గురించి ఈ అమ్మడు కాస్త లేట్‌గా అయినా చాలా క్యూట్‌గా స్పందించింది. తనేమందంటే కొంచెం ఆలస్యంగా చెబుతున్నానన్నది తెలుసు. కోలమావు కోకిల ట్రైలర్‌ అద్భుతం. చిత్రం యూనిట్‌కు శుభాకాంక్షలు. నయనతార కీర్తి, కిరీటాల్లో ఈ చిత్రం మరో డైమండ్‌స్టోన్‌గా నిలిచిపోతుంది అని తన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. అసూయ, రాగద్వేషాలు కలిగిన ఈ రంగంలో సహ నటి గురించి రెండు మంచి మాటలు చెప్పడానికే అంగీరించని ఈ రోజుల్లో అభినందించడానికి చాలా పెద్ద మనసు కావాలి. అది సమంతకు ఉంది. అందుకే ఆమె సహనటి నయనతారను ప్రశంసించింది అంటున్నారు సినీ వర్గాలు. దటీజ్‌ సమంత. చాలా బోల్డ్‌ మనిషి. తకు ఏది అనిపిస్తే అది అనేస్తుందని ఆమె భర్త నాగచైతన్యనే ఇటీవల కితాబిచ్చేశాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top