‘సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు’ | Salman Khan Is Getting Married Me Says Zareen Khan In Interview | Sakshi
Sakshi News home page

సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు: నటి

Aug 18 2019 12:04 PM | Updated on Aug 18 2019 4:18 PM

Salman Khan Is Getting Married Me Says Zareen Khan In Interview - Sakshi

సాక్షి, ముంబై: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తనను పెళ్లి చేసుకోబోతున్నారని నటి జరీన్‌ ఖాన్‌ షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఈమె ఈ మేరకు ఫన్నీ కామెంట్‌ చేశారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘మీపై మీరే ఓ రూమర్‌ సృష్టించాలి. కానీ ఆ రూమర్‌ చాలా వైరల్‌ అవ్వాలి’ అని విలేకరి ఆమెకు ఓ ప్రశ్న వేశారు. ఇందుకు జరీన్‌ స్పందిస్తూ.. ‘సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు. నాపై ఇలాంటి రూమర్స్‌ చాలా ఫన్నీగా ఉంటాయి. నాకు అసలు పెళ్లిపై నమ్మకం లేదు. చెప్పాలంటే ఈ మధ్యకాలంలో పెళ్లనేది కామెడీగా మారిపోయింది’ అని సమాధానమిచ్చిరు. సల్మాన్‌, జరీన్‌ జంటగా ‘వీర్‌’ చిత్రంలో నటించారు. జరీన్‌ను తొలుత బాలీవుడ్‌కు పరిచయం చేసింది సల్మాన్‌ ఖానే కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement