నాగసాధువుగా...

Saif Ali Khan looks quite menacing in the first look of Hunter - Sakshi

సైఫ్‌ అలీఖాన్‌ కళ్లు ఆగ్రహంతో నిండాయి. ఎవరిపై కోపం అంటే.. ‘హంటర్‌’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇప్పటివరకూ కనిపించని విభిన్నమైన గెటప్‌లో సైఫ్‌ కనిపించబోతున్న చిత్రం ఇది. ‘ఎన్‌హెచ్‌ 10’ ఫేమ్‌ నవదీప్‌సింగ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ రాజస్థాన్‌లో పూర్తయింది. ఇప్పుడు సెంకడ్‌ షెడ్యూల్‌ను ముంబైలో స్టార్ట్‌ చేశారు. ఇందులో సైఫ్‌ నాగసాధువు పాత్రలో కనిపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ పాత్రలో కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇక్కడ గడ్డంతో కనిపిస్తున్నారు కదా... అది నకిలీ కాదు. నిజమైన గడ్డం అట. నటుడిగా తననే కొత్తగా ఆవిష్కరించే ఈ సినిమా కోసం ఏ కష్టమైనా పడటానికి రెడీ అన్నట్లుగా ఉన్నారట సైఫ్‌. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top