ఫ్యూచర్‌ ప్లాన్‌

sahoo final schedule shoot at romania - Sakshi

‘సాహో’ ఫ్యూచర్‌ ప్లాన్‌ తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్‌లో యూరప్‌లోని రొమేనియా వెళ్లడానికి స్కెచ్‌ వేశారు. విలన్స్‌ను కుమ్మడమే ఈ స్కెచ్‌ ప్రోగ్రామ్‌ అట. మరి.. ఈ కుమ్ముడు థియేటర్స్‌లోని ఆడియన్స్‌కు ఏ మాత్రం కిక్‌ ఇస్తుందో చూడాలంటే కాస్త టైమ్‌ ఉంది. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందుతున్న సినిమా ‘సాహో’. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో శ్రద్ధా కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో కీలకమైన థర్డ్‌ షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోన్న సంగతి తెలిసిందే.

అలాగే ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ను రొమేనియాలో ప్లాన్‌ చేశారని సమాచారం. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో పాటు నీల్‌ నితిన్‌ ముఖేష్, చుంకీ పాండే, మందిరా బేడీలు కూడా పాల్గొంటారు. రీసెంట్‌గా అబుదాబిలో ముగిసిన యాక్షన్‌ షెడ్యూల్‌ మాదిరిగానే ఈ రొమేనియా షెడ్యూల్‌ కూడా ఉంటుందని టాక్‌. ఈ షెడ్యూల్‌ చిత్రీకరణతో సినిమా ఆల్మోస్ట్‌ పూర్తవుతుందట. లాల్, ఎవెలిన్‌ శర్మ, మురళీ శర్మ, అరుణ్‌ విజయ్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్‌ త్రయం శంకర్‌ ఎహసన్‌ లాయ్‌ సంగీతం అందిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top