రవితేజ, ఆ రీమేక్ చేస్తున్నాడు | raviteja in kanithan remake | Sakshi
Sakshi News home page

రవితేజ, ఆ రీమేక్ చేస్తున్నాడు

Apr 19 2016 2:08 PM | Updated on Sep 3 2017 10:16 PM

రవితేజ, ఆ రీమేక్ చేస్తున్నాడు

రవితేజ, ఆ రీమేక్ చేస్తున్నాడు

టాలీవుడ్లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన సీనియర్ హీరో రవితేజ.

టాలీవుడ్లో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన సీనియర్ హీరో రవితేజ. ఒకప్పుడు టాలీవుడ్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఉన్న రవితేజ, ఇటీవల తన స్థాయికి తగ్గ సక్సెస్లు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు. అయితే ఇటీవల రవితేజ హీరోగా తెరకెక్కిన బెంగాల్ టైగర్ కమర్షియల్గా ఆకట్టుకోవటంతో ఇప్పుడు వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే కొత్త దర్శకుడితో రాబిన్హుడ్ సినిమా చేస్తున్న మాస్ మహరాజ్, మరో రీమేక్ సినిమాకు రెడీ అవుతున్నాడు.
 
తమిళంలో ఘన విజయం సాధించిన కనిదన్ సినిమాను రవితేజ రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఇప్పటివరకు అఫీషియల్గా మాత్రం కన్ఫామ్ చేయలేదు. తాజాగా కనిదన్ చిత్ర దర్శకుడు ఈ విషయాన్ని కన్ఫామ్ చేశాడు. రవితేజకు ఉన్న మాస్ ఇమేజ్కు ఈ సినిమా ఫర్ఫెక్ట్గా సూట్ అవుతుందని కితాబిచ్చాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement