
సాక్షి, సినిమా: క్యాస్టింగ్ కౌచ్‌పై ఇంతకు ముందు కోలీవుడ్‌లో సుచీ లీక్స్ ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. పలువురి గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన ఈ క్యాస్టింగ్ కౌచ్ కొన్ని రోజులుగా శ్రీరెడ్డి లీక్స్‌గా టాలీవుడ్‌ను ఊపేస్తోంది. దీనిపై ఇండస్ట్రీలో చాలా మంది చాలా రకాలుగా స్పందించారు. అయితే తాజాగా నటి, యాంకర్ రష్మీ గౌతమ్ తన ట్విటర్ వేదికగా స్పందించారు.
‘మహిళలపై లైంగిక వేధింపులు ప్రతిచోట జరుగుతున్నాయి. కేవలం సినీ ఇండస్ట్రీనే లక్ష్యంగా చేసుకొని దీన్ని ఇంకా సాగదీయకండి. కాస్టింగ్ కౌచ్ అంటూ కేవలం సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయకండి. ఇక ఇప్పటికైనా ఈ టాపిక్‌కి ఫుల్‌స్టాప్ పెట్టేసి, ఇలాంటి చౌకబారు ఆలోచనలు మానుకోండి’ అని తన ట్విటర్‌లో పేర్కొన్నారు.
Sexual exploitation of women happens every where address the bigger issue and stop targeting the film industry in the name of #castingcouch let’s do our bit to put an end to this rather than making it a topic for cheap thrills https://t.co/D3hIB2KDuP
— rashmi gautam (@rashmigautam27) May 11, 2018