నలభై ముద్దులు! | Ranveer Singh, Vaani Kapoors Befikre clears censor with UA | Sakshi
Sakshi News home page

నలభై ముద్దులు!

Nov 17 2016 11:29 PM | Updated on Sep 4 2017 8:22 PM

నలభై ముద్దులు!

నలభై ముద్దులు!

‘బేఫికర్’... అంటే ‘నిశ్చింత’ అని అర్థం. హీరో రణవీర్ సింగ్, హీరోయిన్ వాణీ కపూర్, దర్శక-నిర్మాత ఆదిత్యా చోప్రా ప్రస్తుతం అలానే ఉన్నారు.

‘బేఫికర్’... అంటే ‘నిశ్చింత’ అని అర్థం. హీరో రణవీర్ సింగ్, హీరోయిన్ వాణీ కపూర్, దర్శక-నిర్మాత ఆదిత్యా చోప్రా ప్రస్తుతం అలానే ఉన్నారు. ఎందుకంటే సెన్సార్ కత్తెర నుంచి వీరి ‘బేఫికర్’ సినిమా సునాయాసంగా తప్పించేసుకుంది. రణవీర్, వాణీ జంటగా ఆదిత్యా చోప్రా తీసిన ఈ సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఈ చిత్రంలో మొత్తం 40 ముద్దు సీన్లు ఉన్నాయి. ట్రైలర్, ఫొటోలు చూసి.. ‘మాంచి రొమాంటిక్ మూవీ’ అని ఇప్పటికే చాలామంది ఫిక్సయ్యారు. సినిమా విడుదల కోసం కొంతమంది ఎదురు చూస్తుంటే.. ఆదిత్యా చోప్రాను సెన్సార్ బోర్డ్ ఏ విధంగా తిప్పలు పెడుతుందో చూడాలని మరికొంతమంది వెయిట్ చేశారు.

కానీ, ఎలాంటి ఇబ్బంది లేకుండా సెన్సార్ పాస్ అయింది. ఒక్క ముద్దు సీన్‌కి కూడా కట్ చెప్పకుండా ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చేసింది సెన్సార్ బోర్డ్. రొమాంటిక్ సన్నివేశా లను ఆదిత్యా చోప్రా కళాత్మకంగా తీస్తారని చెప్పడానికి ఒక్క ‘దిల్‌వాలే దుల్హనియా లే జాయేంగే’ చాలు. తాజా చిత్రం ‘బేఫికర్’లో కూడా అలానే తీశారట. ఇక... సెన్సార్ బోర్డ్ మాత్రం ఏమంటుంది? ‘భలే తీశారు’ అని అభినందించిందట కూడా. సో.. రొమాంటిక్ పీపుల్ నిశ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే.. షూట్ చేసిన నలభై ముద్దు సీన్లూ సినిమాలో ఉంటాయి. ఈ సీన్స్‌లో రణవీర్, వాణీ కెమిస్ట్రీ అదిరిపోయిందట.

Advertisement
 
Advertisement
Advertisement