నా నెక్స్ట్ సినిమా 'వంగవీటి': వర్మ | ramgopal varma next film is Vangaveeti | Sakshi
Sakshi News home page

నా నెక్స్ట్ సినిమా 'వంగవీటి': వర్మ

Jan 2 2016 7:22 PM | Updated on Jul 29 2019 5:43 PM

నా నెక్స్ట్ సినిమా 'వంగవీటి': వర్మ - Sakshi

నా నెక్స్ట్ సినిమా 'వంగవీటి': వర్మ

'కిల్లింగ్ వీరప్పన్‌' సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ తన తదుపరి సినిమా పేరును ప్రకటించారు.

'కిల్లింగ్ వీరప్పన్‌' సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ తన తదుపరి సినిమా పేరును ప్రకటించారు. 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలిపారు. వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో ఈ సినిమా రూపొందించనున్నట్టు ఆయన శనివారం ట్విట్టర్‌లో వెల్లడించారు.

'కిల్లింగ్‌ వీరప్పన్‌'తో మళ్లీ మంచి సినిమాలు తీసి ప్రేక్షకుల మెప్పు పొందగలనని రాంగోపాల్‌ వర్మ నిరూపించకున్నారు. ఇప్పటికే కన్నడంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుతోంది. ఈ నెల 7న 'కిల్లింగ్ వీరప్పన్' తెలుగులో విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement