నంది అవార్డులపై వర్మ సటైరికల్‌ కామెంట్‌ | ram gopal varma sensational comments on nandi awards | Sakshi
Sakshi News home page

అవార్డు కమిటీకి ఆస్కార్ ఇవ్వాలి: వర్మ

Nov 16 2017 9:37 PM | Updated on Oct 22 2018 6:05 PM

ram gopal varma sensational comments on nandi awards - Sakshi

నంది అవార్డులపై డేరింగ్‌ డైరెక్టర్‌, రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో స్పందించారు. అవార్డులు ప్రకటించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రామ్‌గోపాల్‌ వర్మ మాత్రం ఇప్పటి వరకూ వీటిపై స్పందించలేదు. నెట్‌జన్లు, వర్మ అభిమానులు మాత్రం ఆయన స్టేట్‌మెంట్‌ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏదైనా విషయాన్నికుండ బద్దలు కొట్టినట్లే మాట్లాడే వర్మ నంది అవార్డులపై కూడా తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించారు.

అవార్డులపై వర్మ ఏమన్నారో ఆయన మాటల్లోనే ' అబ్బో అబ్బో అబ్బో!!! ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం చూసా...వామ్మో మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రార్డినరీ సూపర్ డూపర్ సెలక్షన్.. నాకు తెలిసి ఇలా ఏమాత్రం 1% పక్షపాతం లేకుండా కేవలం మెరిట్ మీద మాత్రమే అవార్డ్స్ ఇఛ్చిన కమిటీ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు.. ఇంత అద్భుతమైన నిజాయతీ గల నంది అవార్డు కమిటీకి ఖఛ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి .. వావ్ నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్' అంటూ కమిటీ సభ్యులపై సటైర్లు వేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement