మార్చి నుంచి బిజీబిజీగా మెగా హీరో | Ram Charan to start shooting new project from March | Sakshi
Sakshi News home page

మార్చి నుంచి బిజీబిజీగా మెగా హీరో

Feb 22 2016 12:11 PM | Updated on Apr 3 2019 9:02 PM

మార్చి నుంచి బిజీబిజీగా మెగా హీరో - Sakshi

మార్చి నుంచి బిజీబిజీగా మెగా హీరో

ఎట్టకేలకు మెగా వారసుడు రామ్ చరణ్ తేజ తన కొత్త చిత్ర షూటింగ్కు హాజరుకానున్నారు. తమిళంలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన బ్లాక్ బ్లస్టర్ మూవీ 'తనీ ఒరువన్' రీమెక్ కోసం ఆయన మార్చి నెలలో కొబ్బరి కాయ కొట్టనున్నారు.

హైదరాబాద్: ఎట్టకేలకు మెగా వారసుడు రామ్ చరణ్ తేజ తన కొత్త చిత్ర షూటింగ్కు హాజరుకానున్నారు. తమిళంలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన బ్లాక్ బ్లస్టర్ మూవీ 'తనీ ఒరువన్' రీమెక్ కోసం ఆయన మార్చి నెలలో కొబ్బరి కాయ కొట్టనున్నారు. మార్చి మొదటివారంలో ఈ సినిమా ఆయనతో షూటింగ్ షురూ చేయనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి.

'ఈ చిత్ర ప్రాజెక్టు కార్యక్రమాలు నేటి నుంచి హైదరాబాద్ లో కొనసాగుతాయి. అరవింద స్వామి, రకుల్ ప్రీత్ సింగ్ వారి షెడ్యూల్ ప్రకారం హాజరవుతారు. మార్చి తొలివారం నుంచి రామ్ చరణ్ షూటింగ్ లో పాల్గొంటారు' అని చిత్ర యూనిట్ తెలిపింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement