రామ్‌ చరణ్‌, బోయపాటి సినిమా తాజా అప్‌డేట్‌

Ram Charan Boyapati Movie Shooting Update - Sakshi

రంగస్థలం లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్ తరువాత మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అ‍ద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రశాంత్‌ (జీన్స్‌ ఫేం), ఆర్యన్‌ రాజేష్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు.

ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తిగా కావచ్చింది. నవంబర్ 10 నాటికి రెండు పాటలు మినహా మిగతా షూటింగ్‌ అంతా పూర్తవుతుందని వెల్లడించారు చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య. నవంబర్‌ 9 నుంచి డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, త్వరలనే సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా వెల్లడించారు. 2019 సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top