రకుల్‌కు చాన్స్‌ ఉందా? | Rakul Preet in Bharateeyudu 2 Rumours in Tamil Nadu | Sakshi
Sakshi News home page

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

Jul 22 2019 7:16 AM | Updated on Aug 8 2019 11:13 AM

Rakul Preet in Bharateeyudu 2 Rumours in Tamil Nadu - Sakshi

సినిమా: సినీరంగంలో నిలదొక్కుకునే వరకే కష్టడాలి. ఆ తరువాత అపజయాల ప్రభావం అంతగా ఉండదనే చెప్పాలి. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది వర్తిస్తుందని చెప్పవచ్చు. ఫ్లాప్‌ వస్తే పక్కన పెటేస్తారన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు వరుస ఫ్లాప్‌లను ఎదుర్కొంటున్నా, అవకాశాలు తలుపుతడుతూనే ఉన్నాయి. అందుకు ఉదాహరణ ఈతరం హీరోయిన్లే. నిజం చెప్పాలంటే ఇటీవల నటి నయనతార, తమన్నా, కాజల్‌అగర్వాల్‌ వంటి స్టార్‌ హీరోయిన్లు సరైన హిట్స్‌ చూసి చాలా కాలమైంది. అయినా వారంతా ఇప్పుడు చేతినిండా చిత్రాలలో బిజీగానే ఉన్నారు. ఇక నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఈ అమ్మడు తెలుగు, తమిళ భాషల్లో హిట్‌ చూసి చాలా కాలమైంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో దేవ్, ఎన్‌జీకే చిత్రాలు తన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాయి. అలాగని రకుల్‌ప్రీత్‌సింగ్‌ అవరాశాలు లేక కాళీగా కూర్చోలేదు. తెలుగులో స్టార్‌ నటుడు నాగార్జునకు జంటగా మన్మథుడు–2 చిత్రంలో నటించింది.

హిందీలో ఒక చిత్రం చేస్తోంది. ఇక తమిళంలో శివకార్తికేయన్‌ సరసన నటించనుంది. తాజాగా మరో భారీ అవకాశం రకుల్‌ ఇంటి తలుపులు తట్టినట్టు సమాచారం. అదే ఇండియన్‌–2 చిత్రంలో నటించే అవకాశం. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ విశ్వనటుడు కమలహాసన్‌ హీరోగా ఇండియన్‌–2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అప్పుడే ఇందులో నటించే లక్కీచాన్స్‌ నటి కాజల్‌అగర్వాల్‌ను వరించింది. కొంత కాలం క్రితమే ప్రారంభమైన ఈ చిత్రం అనివార్యకారణాల వల్ల ఆగిపోయింది. కాగా సుధీర్ఘ చర్చలనంతరం ఇండియన్‌–2ను శంకర్‌ పట్టాలెక్కించనున్నారు. ఆగస్ట్‌లోనే చిత్ర షూటింగ్‌ మళ్లీ మొదలవనుందని సమాచారం. కాగా ఇందులో నటించే హీరోయిన్ల గురించి రోజుకో నటి గురించి ప్రచారం జరుగుతోంది. ఇండియన్‌–2 చిత్ర షూటింగ్‌ వాయిదా పడడంతో కాజల్‌ వైదొలగిందనే ప్రచారం వైరల్‌ అయ్యింది. మరి ఇప్పుడామె ఉందో లేదో తెలియడం లేదుగానీ, కొత్త నటీమణుల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఆ మధ్య నటి ఐశ్వర్యరాజేశ్‌కు ఇండియన్‌–2లో అవకాశం అనే ప్రచారం జరిగింది. ఇటీవల వర్ధమాన నటి ప్రియాభవానీశంకర్‌ పేరు వెలుగులోకి వచ్చింది. తాజాగా నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేరు వినిపిస్తోంది. ఇండియన్‌–2లో ఆ ముగ్గురితో పాటు రకుల్‌ప్రీత్‌సింగ్‌కూ చోటుందనే టాక్‌ వినిపిస్తోంది. ఇదే గనుక నిజం అయితే ఈ అమ్మడికిది లక్కీచాన్సే అవుతుంది. లైకా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇక తెలుగులో నాగార్జునతో రొమాన్స్‌ చేసిన మన్మథుడు–2 చిత్రం మరో రెండు వారాల్లో తెరపైకి రానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement