వేడుక మొదలెట్టిన చైతూ..! | Raarandoi Veduka Choodham TitleSong | Sakshi
Sakshi News home page

వేడుక మొదలెట్టిన చైతూ..!

May 6 2017 4:37 PM | Updated on Jul 15 2019 9:21 PM

వేడుక మొదలెట్టిన చైతూ..! - Sakshi

వేడుక మొదలెట్టిన చైతూ..!

వరుస సక్సెస్ లతో ఫాం చూపిస్తున్న యంగ్ హీరో నాగచైతన్య తాజా చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ

వరుస సక్సెస్ లతో ఫాం చూపిస్తున్న యంగ్ హీరో నాగచైతన్య తాజా చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం. సోగ్గాడే చిన్ని నాయనా ఫేం కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో ను శనివారం రిలీజ్ చేశారు.

దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా రంజిత్, గోపికా పూర్ణిమలు ఆలపించారు. రేపు సాయంత్రం 30 సెకన్ల టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన నాగ్, త్వరలో 90 సెకన్ల వీడియో ను రిలీజ్ చేస్తామని తెలిపారు.  అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మే నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement