
ప్రేమతో...
రమణశ్రీ ఆర్ట్స్ పతాకంపై గీతా మన్నం సమర్పణలో రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్ గుమ్మకొండ నిర్మించిన చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’.
రమణశ్రీ ఆర్ట్స్ పతాకంపై గీతా మన్నం సమర్పణలో రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్ గుమ్మకొండ నిర్మించిన చిత్రం ‘ప్రేమతో మీ కార్తీక్’. రిషి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి షాన్ రెహమాన్ పాటలు స్వరపరిచారు. కార్తీకేయ, సిమ్రత్, మురళీశర్మ, గొల్లపూడి మారుతిరావు ప్రధాన పాత్రలు పోషించారు. లైన్ ప్రొడ్యూసర్ అశోక్‌రెడ్డి గుమ్మకొండ మాట్లాడుతూ– ‘‘విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రమిది.
జీవితంలో ఎవరికైనా కెరీర్ ఒక భాగం మాత్రమే. అదే లైఫ్ కాదు. కెరీర్, ప్రేమ, కుటుంబం అనే మూడు అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. త్వరలో ప్రచార చిత్రాలను, పాటలను విడులచేస్తాం. వేసవిలో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమేరా: ఉమ్మడిసింగు సాయిప్రసాద్, ఎడిటింగ్: మధు.