ఇప్పటికే విదేశీ నటులు బీటౌన్‌లో తళుక్కుమంటున్నారు.
ఇప్పటికే విదేశీ నటులు బీటౌన్‌లో తళుక్కుమంటున్నారు. ఉన్న తారలు చాలరన్నట్టు పాప్ స్టార్ ఈద్ షీరన్‌ను దిగుమతి చేస్తున్నారు. షారూఖ్‌ఖాన్ సూపర్ హిట్ మూవీ ‘హ్యాపీ న్యూ ఇయర్’కు సీక్వెల్‌లో ఇతగాడితో ఓ రోల్ చేయించాలని దర్శకురాలు ఫరాఖాన్ కోరుకుంటోంది. అందుకు షీరన్‌ను ఒప్పించిందని కూడా సమాచారం. రీసెంట్‌గా ముంబైలో షీరన్ ఇచ్చిన మ్యూజిక్ మస్తీకి బాలీవుడ్ తారలు ఫిదా అయ్యారట. ఆ తరువాత జరిగిన లావిష్ పార్టీలో అభిషేక్‌బచ్చన్, ఫరా తదితర సినీ జనంతో అతగాడి పరిచయాలు కూడా జరిగిపోయాయట! ‘షీరన్ ముంబై వస్తున్నాడని, నాతో పాటు ఇతర హిందీ నటులను కలవాలనుకుంటున్నాడని లండన్‌లో ఉంటున్న మా కజిన్ జుబిన్ ఫోన్‌లో చెప్పింది. ఇది విని స్టన్నయ్యా. షీర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి అభిషేక్ కూడా ఓకే అన్నాడు’ అంటూ చెప్పుకొచ్చింది ఫరా! ఇండియన్ స్క్రీన్‌పై ఈ పాప్ స్టార్ ఏమాత్రం పాపులర్ అవుతాడో చూడాలి!