ఈజీ మనీ కోసం...

Paisa Paramatma Movie Motion Poster - Sakshi

‘‘పైసా పరమాత్మ’ టైటిల్, పోస్టర్‌ చాలా బాగున్నాయి. కథను దర్శకుడు విజయ్‌ నాకు చెప్పారు. చాలా కొత్తగా ఉందనిపించింది. ప్రతిభ ఉన్నవారు కొత్త కాన్సెప్ట్‌లతో ముందుకు రావాలి. కొత్త కంటెంట్‌తో డిఫరెంట్‌గా తీస్తే ఆడియన్స్‌ ఆదరిస్తున్నారు. ఆ విషయం ‘గూఢచారి’ చిత్రంతో మరోసారి రుజువైంది’’ అని నిర్మాత రాజ్‌ కందుకూరి అన్నారు. సంకేత్, సుధీర్, కృష్ణతేజ, రమణ, అనూష, ఆరోహి నాయుడు, బనీష ప్రధాన పాత్రల్లో విజయ్‌ కిరణ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పైసా పరమాత్మ’.

లక్ష్మీ సుచిత్ర క్రియేషన్స్‌ పతాకంపై విజయ్‌ జగత్‌ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మోషన్‌ పోస్టర్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని రాజ్‌ కందుకూరి విడుదల చే శారు. విజయ్‌ కిరణ్‌ మాట్లాడుతూ –‘‘ఈజీ మనీ కోసం దొంగతనాలు, మోసాలు చేస్తోన్న ఓ నలుగురు కుర్రాళ్లు, ఇద్దరు యువతులు అనుకోకుండా ఓ సమస్యలో ఇరుక్కుంటారు. ఆ సమస్య నుంచి వారు బయట పడ్డారా? లేదా? అన్నది ముఖ్య కథాంశం’’ అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top