మరో మల్టీస్టారర్‌ చిత్రంలో రానా! | Pa Ranjith Plan To Direct Multi Starrer Movie | Sakshi
Sakshi News home page

పా.రంజిత్‌ దర్శకత్వంలో మల్టీస్టారర్‌

Jul 2 2019 7:16 AM | Updated on Aug 11 2019 12:52 PM

Pa Ranjith Plan To Direct Multi Starrer Movie - Sakshi

చెన్నై : కోలీవుడ్‌ ఇటీవలి కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలపై దృష్టి సారిస్తోందని చెప్పవచ్చు. ఇటీవల మణిరత్నం ‘సెక్క సెవంద వానం’పేరుతో మల్టీస్టారర్‌ చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా మల్టీస్టారర్‌ చిత్రం ‘పొన్నియన్‌ సెల్వమ్‌’భారీగా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో జయంరవి, కార్తీ, అమితాబ్‌బచ్చన్, ఐశ్వర్యరాయ్, అనుష్క, కీర్తీసురేశ్, మోహన్‌బాబు ఇలా పలువురు ప్రముఖ నటీనటులు నటించనున్నారు. అదే విధంగా దర్శకుడు పా.రంజిత్‌ ఇక మల్టీస్టారర్‌ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారనేది తాజా సమాచారం.

ఈయన ఇంతకు ముందు రజనీకాంత్‌ హీరోగా కబాలి, కాలా చిత్రాలను తెరకెక్కించి సక్సెస్‌ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పా.రంజిత్‌ హిందీలో ప్రముఖ స్వాతంత్య్ర పోరాటయోధుడు బిర్సా ముండా బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం 2020లో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇలాంటిది తాజాగా ఒక మల్టీస్టారర్‌ చిత్రానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో ఆర్య, రానా, సత్యరాజ్‌లు నటించనున్నట్లు సమాచారం. ఇందుకోసం వారితో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరి కొంతమంది ప్రముఖ నటీనటులు ఇందులో నటించనున్నారని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement