న్యూ లుక్‌.. న్యూ క్యారెక్టర్‌ | nithin bhishma movie shooting launch | Sakshi
Sakshi News home page

న్యూ లుక్‌.. న్యూ క్యారెక్టర్‌

Jun 21 2019 1:05 AM | Updated on Jun 21 2019 1:05 AM

nithin bhishma movie shooting launch - Sakshi

నితిన్‌

‘భీష్మ’ చిత్రంతో కొత్త ప్రయాణాన్ని సంతోషంగా ఆరంభించానంటున్నారు హీరో నితిన్‌. ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్‌ హీరోగా ‘భీష్మ’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ గురువారం మొదలైంది. ‘‘దాదాపు ఏడాది తర్వాత కెమెరా ముందుకు వచ్చాను. ‘న్యూ డే.. న్యూ లుక్‌.. న్యూ క్యారెక్టర్‌’. ‘భీష్మ’ ప్రయాణాన్ని స్టార్ట్‌ చేస్తున్నందుకు ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని నితిన్‌ పేర్కొన్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కాకుండా చంద్రశేఖర్‌ ఏలేటి, కృష్ణచైతన్య దర్శకత్వాల్లో సినిమాలు కమిట్‌ అయ్యారు నితిన్‌.

Advertisement
 
Advertisement
Advertisement