క్రికెట్‌ దిగ్గజం కొడుకుతో నటి పెళ్లి

Neha Dhupia ties the knot with Angad Bedi - Sakshi

అంగద్‌ బేడీని మనువాడిన నేహా ధూపియా

ముంబై: డేటింగ్‌ నుంచి మొదలుపెడితే ఎంగేజ్‌మెంట్‌.. ముహుర్తం ఖరారు.. బందువుల రాక.. మెహెందీ, సంగీత్‌.. పెళ్లి.. అప్పగింతలు.. వందలకొద్దీ వార్తలు, వేలకొద్దీ ఫొటోలు, సోషల్‌మీడియాలో చర్చలు..!! సెలబ్రిటీల పెళ్లివేడుకల్లో సాధారణంగా చోటుచేసుకున్న ఈ రొటీన్‌కు కాస్త భిన్నంగా.. చడీచప్పుడు లేకుండా ఎకాఎకిన పెళ్లిచేసేసుకుని అభిమానులకు స్వీట్‌ షాకిచ్చింది హీరోయిన్‌ నేహా ధూపియా.

క్రికెట్‌ దిగ్గజం కుమారుడు: భారత క్రికెట్‌లో దిగ్గజ స్పిన్నర్‌గా పేరుపొందిన బిషన్‌ సింగ్‌ బేడీ తనయుడు అంగద్‌ బేటీనే నేహా వివాహం చేసుకుంది. అంగద్‌ సైతం బాలీవుడ్‌లో, టీవీ రంగంలో నటుడిగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం పంజాబీ సంప్రదాయంలో జరిగిన ఈ వేడుకలో ఇరు కుటుంబాలు, కొద్దిమంది సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. పెళ్లి దుస్తుల్లో మెరిపోతున్న ఫొటోలను.. స్వయంగా వధూవరులే పోస్ట్‌ చేశారు. ‘‘లైఫ్‌లో తీసుకున్న బెస్ట్‌ నిర్ణయం ఇదే.. నా ఫ్రెండ్‌ అంగద్‌ను పెళ్లి చేసుకున్నాను. హలో.. హస్బెండ్‌గారు..’’ అని నేహా రాసుకొచ్చింది. ‘ఇప్పటిదాకా స్నేహితురాలు.. ఇకనుంచి భార్య’ అంటూ అంగద్‌ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సోషల్‌ మీడియా ద్వారా పెళ్లి వార్తలు తెలుసుకున్న ప్రముఖులంతా కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు..

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top